వాట్సాప్‌కు దీటుగా టెలిగ్రామ్‌ నయా ఫీచర్‌!

వాట్సాప్‌కు దీటుగా టెలిగ్రామ్‌ నయా ఫీచర్‌!

ఇప్పటి వరకు స్క్రీన్‌ షేరింగ్, గ్రూప్‌ సమావేశాలు, స్టిక్కర్స్‌ డౌన్‌లోడ్‌ కేవలం ప్రముఖ మెసేంజర్‌ యాప్‌ వాట్సాప్‌లోనే ఉండేవి.

వాట్సాప్‌కు దీటుగా టెలిగ్రామ్‌ నయా ఫీచర్‌!

కానీ, ఆ జాబితాల్లోకి మరో యాప్‌ కూడా వచ్చేసింది.అదే టెలిగ్రామ్‌ యాప్‌.

వాట్సాప్‌కు దీటుగా టెలిగ్రామ్‌ నయా ఫీచర్‌!

వాట్సాప్‌కు దీటుగా నిలుస్తూ వస్తున్న టెలిగ్రామ్‌ యాప్‌ కూడా ఇక పై ఈ ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

టెలిగ్రామ్‌ వినియోగదారులు కూడా ఎంచక్కా ఆన్‌లైన్‌ క్లాసులకు కూడా అటెండ్‌ కావచ్చు.అంతేకాదు, నాయిస్‌ సస్పెన్షన్, యానిమేటెడ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ వంటి ఇతర ఫీచర్లు కూడా టెలిగ్రామ్‌ యాప్‌లో పొందుపరచారు.

త్వరలో లైవ్‌ గేమ్స్‌ స్ట్రీమింగ్, లైవ్‌ ఈవెంట్స్‌తో పాటు ఇతర సదుపాయలు కూడా తీసుకువస్తామని టెలిగ్రామ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రకటించింది.

డెస్క్‌టాప్‌లో వాయిస్‌ ఛాట్‌కు ప్రత్యేకంగా విండ్‌ ఓపెన్‌ అయ్యే అవకాశం కూడా ఉంటుంది.

దీంతో ఇక ఆ స్క్రీన్‌ను మినిమైజ్‌ చేసే అవసరం లేకుండానే ఛాట్‌ చేసేవచ్చు.

H3 Class=subheader-styleఉపయోగించే విధానం./h3p టెలిగ్రామ్‌ గ్రూప్‌లో యాక్టివ్‌ సెషన్‌లో ఉంటే షేర్‌ మై వీడియో ఆప్షన్‌ను సెలెక్ట్‌ చేయడం వల్ల ఈ యాప్‌లో గ్రూప్‌ వీడియో కాల్స్‌ చేసే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం టెలిగ్రామ్‌ యాప్‌లో దాదాపు 30 మంది వీడియో కాల్‌లో ఒకే సమయంలో మాట్లాడే సదుపాయాన్ని కల్పించింది.

రానున్న రోజుల్లో ఈ సంఖ్యను మరింత పెంచనున్నట్లు తెలిపింది.అంతేకాదు కేవలం కీబోర్డు ద్వారానే ఎమోజీ, స్టిక్కర్లను పంపించే ఫీచర్‌ను కూడా పరిచయం చేసింది.

స్టిక్కర్లను స్వయంగా తయారు కూడా చేసుకోవచ్చు.దీనికి బోట్‌ ఆప్షన్‌ ఉంది.

"""/"/ అదేవిధంగా టెలిగ్రామ్‌ యానిమేటెడ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ అనే ప్రత్యేక ఫీచర్‌ను తీసుకువచ్చింది.

మీరు ఛాట్‌ లేదా సందేశాలు పంపించినప్పుడు కలర్‌ఫుల్‌గా వాల్‌పేపర్‌ యాడ్‌ అవుతుంది.దీంతో చూడటానికి కూడా అందంగా కనిపిస్తుంది.

దీనికి ఛాట్‌ సెట్టింగ్‌లోకి వెళ్లి ఛేంజ్‌ ఛాట్‌ ఫీచర్‌ అందుబాటులో ఉంటుంది.ఇది ఐఓఎస్‌ స్మార్ట్‌ ఫోన్లలో కూడా ఉంది.

ఇది అప్పియరెన్స్‌ అనే ఆప్షన్‌ ఉంటుంది.దీంతో వినియోగదారులు తమకు నచ్చిన రంగుల్లో బ్యాక్‌గ్రౌండ్‌ను సెట్‌ చేసుకోవచ్చు.

టూ స్టెప్‌ వెరిఫికేషన్‌ మార్చుకున్నప్పుడల్లా వినియోగదారులకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ వస్తుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్2, బుధవారం 2025

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్2, బుధవారం 2025