విత్తన లభ్యత, సరఫరా పై టెలికాన్ కాన్ఫరెన్స్
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా:వానా కాలం ప్రారంభం అయిన నేపథ్యంలో వ్యవసాయ శాఖ సంచాలకులు గారు విత్తన లభ్యత,సరఫరా గురించి టెలీ కాన్ఫరెన్స్ తీసుకుని సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ వానాకాలం లో ప్రాధమికoగా పచ్చి రొట్ట పంట అయిన జీలుగ విత్తనాలు 2250 క్వింటా జిల్లాకు కేటాయించడం జరిగింది.
గత సంవత్సరం లో 2200 క్వింటాళ్ల జీలుగు విత్తనాలు రైతులకు సరఫరా చేయడం జరిగింది.
ఈ సీజన్ లో ఇప్పటికే 1582.20 క్వింటాళ్ల విత్తనాలు ప్రాధమిక వ్యవసాయ సంఘాలు, ఆగ్రో రైతు సేవా కేంద్రాలు( Agro Farmer Seva Kendras ), డి సి ఎమ్ ఎస్ ల ద్వారా సరఫరా చేయడం జరిగింది.
మన జిల్లా కి కేటాయించిన మిగతా 667.80 క్వింటాళ్ల విత్తనాలు కూడా త్వరగా సరఫరాకు కోరడం జరిగింది.
జిల్లా లో పత్తి సాగు గత సంవత్సరం లో 50552 ఎకరాలు సాగు చేయగా, ఈ సంవత్సరం లో 49215 ఎకరాలు సాగు చేస్తారని అంచనాలు వేసి 1,76000 పత్తి విత్తన ప్యాకెట్లు అవసరం అవుతాయని విత్తనాలు సరఫరా చేయాలని డీలర్ ల ని ఆదేశించడం జరిగినది.
జిల్లాలో ఇప్పటి వరకు 48000 పత్తి విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉంచడం జరిగింది.
5670 విత్తన ప్యాకెట్లు రైతులు కొనుగోలు చేయడం జరిగింది.జిల్లాలోని రైతుల కి తెలియ చేయునది ఏమనగా, ఏ కంపెనీ బి జి II పత్తి విత్తనాల రకాలు అయినా కూడా దిగుబడి లో వ్యత్యాసం ఉండదు అని తెలియ చేస్తూ.
అందరూ రైతులు విధిగా లైసెన్స్ పొందిన డీలర్ దగ్గర మాత్రమే రశీదు పొంది విత్తనాలు కొనాలని మరియు బిల్లులు పంట కాలం మొత్తం భద్ర పరుచుకొని ఉండాలని కోరుతున్నాము.
జిల్లాలో పత్తి విత్తనాల కొరత లేదు అని కూడా తెలియచేయుజేస్తూన్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి( Anurag Jayanthi ) ఒక ప్రకటనలో తెలిపారు.