టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆ అధికారుల గుర్రు ఎందుకు ?

తెలంగాణాలో టీఆర్ఎస్ ప్రభుత్వం పై అన్ని వర్గాల నుంచి రోజు రోజుకు విమర్శలు, అసంతృప్తులు పెరిగిపోతున్నాయి.

మొన్నటి వరకు సొంత పార్టీ నేతలు అసంతృప్తి రాగం వినిపించగా ఇప్పుడు ప్రభుత్వధికారులు గుర్రుగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

దీనికి కారణం సెక్రటేరియట్‌ను బలవంతంగా ఖాళీ చేయించి ఇబ్బంది పెడుతున్నారనే అభిప్రాయానికి వారు వస్తున్నారు.

ప్రస్తుతం ఉన్నతాత్కాలిక భవనాన్ని సరైన ఏర్పాట్లు చేయకుండానే తొలగింపు ఆదేశాలివ్వడం వారిని మరింత ఇబ్బందికి గురిచేస్తోంది.

తాత్కాలిక సెక్రటేరియట్ గా ఉన్న బూర్గుల భవన్‌లో కనీస సౌకర్యాలు కరువయ్యాయని అధికారులు అసంతృప్తిలో ఉన్నారు.

ఇటువంటి అసంతృప్తుల మధ్యే సెక్రెటరీ తరలిస్తున్నారు.దీనికోసం ఉద్యోగుల సెలవులను కూడా తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది.

"""/"/ అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం సెక్రటరీ తరలింపు ఎంత వేగంగా చేయాలని చూస్తున్నా అందుకు వీలుపడడంలేదు.

దీనికి అనేక అడ్డంకులు కూడా ఏర్పడినట్టు తెలుస్తోంది.ఇప్పటికే సెక్రటేరియట్ కూల్చివేత, తరలింపుపై కేసులు దాఖలు కావడంతో ప్రక్రియ ఆలస్యమైంది.

కేసులు వెంటనే తేలిపోతాయని భావించిన ప్రభుత్వం భూమి పూజ తర్వాత కొద్ది రోజులు ఎదురుచూపులు చూసింది.

కేసు విషయం తేలే లోగా సెక్రటేరియట్ తరలింపు పూర్తి చేయాలని డిసైడ్ అయ్యింది.

ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా బూర్గుల భవన్లో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలను హడావుడిగా ఖాళీ చేసి మరో చోటికి పంపారు.

బిఆర్కే భవనం ఖాళీ కాగానే అందులోకి వెంటనే సెక్రటేరియట్ ను మారుస్తున్నారు. """/"/ బీఆర్కేభవన్‌లో ఏ ఫ్లోర్ లోనూ సరైన వసతులు లేవని గుర్తించి ప్రతీ ఫ్లోర్ మరమ్మత్తులు, విద్యుద్దీకరణ,కలర్స్ కోసం 20 లక్షలు కేటాయించారు.

పనులు చేస్తున్నప్పటికీ.బిఆర్కే భవన్ కు వెళ్లిన ఉద్యోగులు అక్కడి పరిస్థితి చూసి ఆందోళన చెందుతున్నారట.

అక్కడ పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించే వరకూ తాము వెళ్ళేది లేదని చెప్పేస్తున్నారు.

టాయిలెట్లు,డ్రైనేజీ పైపు లైన్లు,లిఫ్లులు,కలరింగ్ పూర్తి కావడానికి మరో నెల రోజులకు పైగా సమయం పడుతుందని ఉద్యోగులు చెబుతున్నారు.

ఇవన్నీ పూర్తయ్యాక ఇంటర్నెట్,కమ్యూనికేషన్ వ్యవస్థను పూర్తి చేయడానికి కనీసం 45 రోజుల సమయం కావాలని ఐటి శాఖ చెప్తోంది.

ఈ గందరోగళం మధ్య తరలింపుపై తీవ్రమైన ఒత్తిడి వస్తూండటంతో ప్రభుత్వంపై అధికారులు గుర్రుగా ఉన్నారు.

ఇంత హడావుడిగా తరలింపు చేపట్టాల్సిన అవసరం ఏంటి అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

గ్రామ సచివాలయ వ్యవస్థలో కీలక మార్పులు