మాస్టర్‌ ప్లాన్‌ : తెలంగాణ బీజేపీ సీఎం క్యాండెట్‌ ఈయనేనా?

తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి.రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ తర్వాత స్థానంలో ఉన్న కాంగ్రెస్‌ మొన్నటి ఎన్నికల్లో బొక్క బోర్లా పడింది.

ఇక పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకోవడంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కించుకునేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి.

దక్షిణ భారతంలో ఒక్క కర్ణాటకలో తప్ప మరెక్కడ కూడా కమలం జెండా ఎగరలేదు.

కర్ణాటక తర్వాత కాషాయం రంగు తెలంగాణలో పండాలని బీజేపీ అధినాయకత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది.

అందుకోసం తెలుగు సీనియర్‌ నాయకుడు విద్యాసాగర్‌ రావును రంగంలోకి దించాలని నిర్ణయించింది.</br> మొన్నటి వరకు మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న విద్యాసాగర్‌ రావు ఇటీవలే పదవి విరమణ పొందారు.

మళ్లీ ఆయన పదవిని కొనసాగించలేదు.బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తీసుకు వచ్చేందుకు ఆయనన్ను వాడుకోవాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తుంది.

అందుకోసం ఏకంగా ఆయన్ను రాబోయే ఎన్నికల సీఎం అభ్యర్థిగా బరిలోకి దించే ప్రయత్నం చేస్తుంది.

ఇక రాష్ట్రంలోని కీలక నాయకులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.అందుకే వారిని బీజేపీలోకి లాగే బాధ్యత కూడా ఆయనకే అధినాయకత్వం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

తెలంగాణలో కేంద్రం అమలు చేస్తున్న పథకాలను వాటి వల్ల ప్రజలు పొందుతున్న లబ్దిని పెద్ద ఎత్తున ప్రచారం చేసే బాధ్యతను కూడా విద్యాసాగర్‌కు ఇవ్వబోతున్నారు.

అన్ని అనుకున్నట్లుగా జరిగితే 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.ఆ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఏంటో చూడాలి.