Renuka Success Story : నాన్న రైతు.. భర్త ప్రోత్సాహంతో 3 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఈమె సక్సెస్ కు వావ్ అనాల్సిందే!
TeluguStop.com
ఒకసారి ఒక ప్రభుత్వ ఉద్యోగం( Government Job ) సాధించడమే ఎంతో కష్టం కాగా కొంతమంది ఏకంగా రెండు, మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా( Medak District ) మంగోజిపల్లి గ్రామానికి చెందిన రేణుక( Renuka ) ఒకే సమయంలో మూడు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించడం గమనార్హం.
రేణుక కుటుంబం వ్యవసాయ కుటుంబం కాగా తల్లీదండ్రులు, భర్త ప్రోత్సహించడం వల్లే లక్ష్యాన్ని సాధించానని ఆమె చెబుతున్నారు.
ఏడేళ్ల క్రితం వివాహమైనా రేణుక మాత్రం ఏదో ఒకరోజు లక్ష్యాన్ని సాధిస్తానని నమ్మకంతో ఉన్నారు.
భర్త నుంచి కూడా ప్రోత్సాహం లభించడం వల్లే అనుకున్నది సాధించానని ఆమె చెబుతున్నారు.
మెదక్ లోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో పదో తరగతి వరకు చదివిన రేణుక ఆదర్శ జూనియర్ కాలేజ్ లో ఇంటర్ పూర్తి చేశారు.
2014లో హైదరాబాద్ లోని నిజాం కాలేజ్ లో రేణుక డిగ్రీ పూర్తి చేశారు.
"""/" /
ఆ తర్వాత కోఠి ఉమెన్స్ కాలేజ్ లో ఆమె ఎం.
కామ్ పూర్తి చేయడం జరిగింది.రేణుక పోటీ పరీక్షలు( Competitive Exams ) రాయడం ద్వారా కామర్స్ లో జూనియర్ లెక్చరర్ తో( Jr Lecturer ) పాటు పిజీటీ సోషల్ టీచర్, టీజీటీ సోషల్ టీచర్ ఉద్యోగాలకు ఎంపిక కావడం జరిగింది.
ఎన్నో ఇబ్బందులు ఎదురైనా రేణుక మాత్రం తన లక్ష్యాన్ని వదిలిపెట్టలేదు.భర్త ప్రోత్సాహం, గురుకుల పరీక్షలలో రాణించడం కూడా ఆమెకు కలిసొచ్చింది.
"""/" /
రేణుక సక్సెస్ స్టోరీ( Renuka Success Story ) నెట్టింట వైరల్ అవుతుండగా రైతు కుటుంబానికి చెందిన రేణుక తన సక్సెస్ తో ప్రశంసలు అందుకుంటున్నారు.
బాల్యం నుంచి చదువులో చురుకుగా ఉన్న రేణుక పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్లలో స్పూర్తిని నింపుతున్నారు.
రేణుక టాలెంట్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.రేణుక సక్సెస్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ధనుష్ పై సంచలన పోస్ట్ చేసిన విగ్నేష్… కాసేపటికే డిలీట్… ఏమైందంటే?