సమిష్టి కృషితోనే ఉన్నత స్థానానికి తెలంగాణ..: సీఎం కేసీఆర్

జగిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు.ఇందులో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

ఈ నేపథ్యంలోనే కొత్త పార్టీ కార్యాలయంతో పాటు కలెక్టరేట్ ను ప్రారంభించారు.అనంతరం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ భయంకరమైన కారు చీకట్లను చీల్చుకుంటూ ముందుకెళ్లామని కేసీఆర్ అన్నారు.

తెలంగాణ ఏర్పడినప్పుడు తొలి బడ్జెట్ రూ.62 వేల కోట్లని చెప్పారు.

ఈ ఏడాది రూ.2.

20 లక్షల కోట్లు దాటిపోతామని తెలిపారు.రాష్ట్రం ఏర్పడినప్పుడు అనిశ్చితి ఉందని వెల్లడించారు.

దేశంలో 24 గంటలు కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వెల్లడించారు.

నాడు కరువులు, వలసలతో తెలంగాణ రోదించిందని సీఎం కేసీఆర్ అన్నారు.ఇవాళ సమిష్టి కృషితోనే ఉన్నత స్థానానికి చేరిందని తెలిపారు.

కేంద్రం సహకరించకున్నా జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకుంటున్నామని పేర్కొన్నారు.రూ.

108 కోట్లతో జగిత్యాల మెడికల్ కాలేజీ నిర్మిస్తున్నామని కేసీఆర్ వెల్లడించారు.

కరోనా తర్వాత ఇండస్ట్రీకి కలిసిరాలేదా.. ఏప్రిల్ లో విడుదలైన మెజారిటీ సినిమాలు ఫ్లాపా?