ఎవరు గెలిస్తే తెలంగాణ ముందుకు వెళ్తుందో వారినే గెలిపించండి: కేసీఆర్

ఇప్పుడు తనకు అనేక సవాళ్ళు చేస్తున్న ఈ నేతలు అందరూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఎక్కడికి పోయారని ఫైర్ అయ్యారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.

( CM KCR ) మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేటలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో( Praja Aashirvada Sabha ) పాల్గొన్న ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

పదేళ్ల క్రితం తెలంగాణ ఎదుర్కొన్న పరిస్తుతులకు ఇప్పటి తెలంగాణకు మీరే పోలిక చూసుకోండంటూ ఆయన ప్రజలకు విన్నవించారు.

ఒకప్పుడు పాలమూరులో గంజి కేంద్రాలు ఉండేవని , ప్రజలు పొట్ట చేతపట్టుకుని బ్రతుకు తెరువు కోసం వలసలు పోయేవారని ఇప్పుడు కనిపిస్తున్న అభివృద్ధి అంతా బారాస తోనే( BRS ) సాధ్యమైందని ఆయన చెప్పుకొచ్చారు.

కొంతమంది నాకు కొడంగల్ కి రా ,గాంధీ బొమ్మ దగ్గరకు రా, అంటూ సవాలు చేస్తున్నారని కేసీఆర్ సమర్థత ఎంతో దేశం ఇప్పటికే చూసిందని, ఇప్పుడు ఎవరికీ చూపించాల్సిన అవసరం లేదన్నారు.

"""/" / 60 లక్షల టన్నుల వరి పండే తెలంగాణలో ఇప్పుడు మూడు కోట్ల టన్నుల దాన్యం పండుతుందని , పాలమూరు ప్రాజెక్టును( Palamuru Project ) పూర్తి చేసి ఇంకో లక్ష ఎకరాలకు నీరు అందిస్తామంటూ ఆయన చెప్పుకొచ్చారు.

24 గంటల కరెంటు ఇస్తే కాంగ్రెస్ కండువా వీడి బారాస కండువా కప్పుకుంటానని జానారెడ్డి( Janareddy ) చెప్పారని, చేసి చూపిన తర్వాత ఆయన వెనకడుగు వేశారంటూ చెప్పుకొచ్చారు.

తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలంగాణ అంధకారంలోకి వెళ్ళిపోతుందన్న శాపనార్థాలను తిప్పికొట్టి 24 గంటలు కరెంటు ఇచ్చి దేశంలోనే తెలంగాణను దిక్సూచిగా నిలబెట్టుకున్నామని ఈ ప్రయాణం ఆగకూడదంటూ ఆయన చెప్పుకొచ్చారు.

"""/" / ఇంటింటికి నల్లా నీళ్లు ఇస్తున్నామని ధీమాగా చెప్పగలమని, తెలంగాణ సర్వతో ముఖాభివృద్ధి బారాస తోనే సాధ్యమంటూ కేసీఆర్ చెప్పుకొచ్చారు తెలంగాణకు ఎవరు గెలిస్తే మంచి జరుగుతుందో వారిని గెలిపించండి అంటూ ఆయన ప్రజలకు సూచించారు .

రైతుబంధు పథకాన్ని( Rythu Bandhu ) దశలవారీగా 16 వేలకు పెంచుతామని ఆయన చెప్పుకొచ్చారు.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకం పై 105 కేసులు వేసి ఆపు చేసిన కాంగ్రెస్ వాళ్లు రైతు సంక్షేమం గురించి మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

ప్రజాస్వామ్యం లో వోటు( Vote ) చాలా శక్తివంతమైన ఆయుధం అని ఆలోచించి వోటు వేయాల్సిందినగా ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.