అహంకారాన్ని తిరస్కరించిన తెలంగాణ ఓటర్?

తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమాల పార్టీ నాయకుడిగా కేసీఆర్( KCR ) తెలంగాణలో అత్యంత పాపులర్ రాజకీయ నాయకుడు అని చెప్పవచ్చు .

ముఖ్యంగా తెలంగాణ వచ్చుడో కెసిఆర్ సచ్చుడో అన్న నినాదం తెలంగాణ ఉద్యమంలో అత్యంత పాపులర్ అయింది.

అనేక కారణాలతో కాంగ్రెస్ తెలంగాణకు విభజన కు ఒప్పుకున్నా ఈ దిశగా దేశంలోని రాజకీయ పార్టీలు అన్నిటిని ఒప్పుకోక తప్పని పరిస్థితి సృష్టించిన పోరాటాలు చేసిన పార్టీ మాత్రం బిఆర్ఎస్( Brs ) గాననే చెప్పవచ్చు.

ఆ రకంగా తెలంగాణ పితామహుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ కు రెండుసార్లు అధికారం ఇవ్వటం ద్వారా తెలంగాణ ఓటర్ రుణం తీర్చుకున్నాడు అనే చెప్పవచ్చు .

"""/" / అయితే ఉద్యమ నాయకుడి నుంచి ముఖ్యమంత్రిగా మారిన తర్వాత కేసీఆర్ వ్యవహార శైలీ లో కొట్టొచ్చినట్టుగా కనిపించిన మార్పుకు తెలంగాణ ఓటర్ నిరాశ చెందాడని ఈ ఫలితాలు రుజువు చేస్తున్నాయి.

ముఖ్యంగా విపరీతమైన అవినీతి ఆరోపణలు వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యేలను మంత్రులను కూడా తిరిగి కొనసాగించడం, వారికి టికెట్ లు ఇవ్వడం పఓటమికి ప్రదాన కారణం గా బావిస్తున్నారు .

పాలనలో వైపల్యాలపై రేగిన ఉద్యమాలను నిర్దాక్షిణ్యంగా అణచివేయడం , రాచరిక పాలన పద్ధతిలో పరిపాలన నడిపించడం.

"""/" / తనకు తిరుగులేదు అన్న విదం గా ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసే విదం గా కొన్ని నిర్ణయాలు తీసుకున్న విధానం ఒకరకంగా తెలంగాణ ఓటర్ ను కెసిఆర్ కు దూరం చేసినందని చెప్పవచ్చు .

ఇది కాంగ్రెస్( Congress ) గెలుపుగా కన్నా బిఆర్ఎస్ ఓటమి గానే తెలంగాణ ప్రజలు చూశారు అనడానికి వస్తున్న ఫలితాలను నిదర్శనంగా చెప్పవచ్చని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

నిజానికి తెలంగాణలోని వ్యవసాయ రంగంతో పాటు టెక్నాలజీ రంగాలకి బిఆర్ఎస్ చేసిన కృషి చాలానే ఉంది.

అయితే అభివృద్ధి కన్నా అవినీతి అజెండా నే ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించినట్లుగా తెలుస్తుంది మరి వైఫల్యాలను బారాసా నాయకులు హుందాగా అంగీకరించి తప్పులు దిద్దుకుని ముందుకు వెళ్తారు లేక తాను పట్టిన కుందేలు మూడే కాళ్ళు అనేలా వ్యవహరిస్తారో అసలు ఓటమి పై ఆ నేతల స్పందన ఏమిటో వేచి చూడాలి.

చింత‌పండు ఆరోగ్య‌క‌ర‌మా? కాదా?.. ఎవ‌రెవ‌రు తిన‌కూడ‌దు!