దేశానికే ఆదర్శంగా తెలంగాణ పల్లెలు – జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో సమ్మిళిత అభివృద్ధితో పాటు, విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని, తెలంగాణ, రాజన్న సిరిసిల్ల జిల్లాల పల్లెలు దేశానికే ఆదర్శంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు.

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవాన్ని పురస్కరించుకుని చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ బి.

సత్య ప్రసాద్ పాల్గొన్నారు.ముందుగా గ్రామ ప్రజలు బతుకమ్మలతో పండుగ వాతావరణంలో గ్రామ పంచాయితీ కార్యాలయం వరకు ర్యాలీగా తరలివచ్చారు.

గ్రామ పంచాయితీ కార్యాలయం ఆవరణలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ బి.

సత్య ప్రసాద్ లు గ్రామ ప్రజలతో మమేకమై గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమం అమలు ద్వారా సాధించిన అభివృద్ధి, సంభవించిన మార్పులు, తదితర అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రతీ గ్రామ పంచాయితీకి పల్లె ప్రకృతి వనం, కంపోస్ట్ షెడ్, డంపింగ్ యార్డ్, వైకుంఠధామం, ట్రాక్టర్, తెలంగాణ క్రీడా ప్రాంగణం, ఎవెన్యూ ప్లాంటేషన్, పల్లె దవాఖాన, రైతు వేదికలను సమకూర్చుకున్నామని తెలిపారు.

పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో జరిగిన సమ్మిళిత అభివృద్ధిని అందరికీ తెలపడం కోసం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవాన్ని జరపడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.

గ్రామ పంచాయితీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల కృషి ద్వారానే గ్రామం నిత్యం పచ్చదనంతో ఫరిడవిల్లుతూ, పరిశుభ్రంగా ఉంటుందని అన్నారు.

ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేసి, గ్రామాలను మరింత అభివృద్ధి చేయడానికి పాటు పడాలని జిల్లా కలెక్టర్ కోరారు.

అనంతరం జిల్లా కలెక్టర్ గ్రామ పంచాయితీ సిబ్బంది చేస్తున్న సేవలను అభినందిస్తూ, వారిని ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయితీ అధికారి ఎ.రవీందర్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.

సుమన్ మోహన్ రావు, ఎంపీడీఓ రవీందర్, ఎంపీఓ ప్రదీప్, సర్పంచ్ అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.

H3 Class=subheader-styleపల్లె ప్రగతి దినోత్సవం గ్రాండ్ సక్సెస్/h3p రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లాలో గురువారం నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది.

జిల్లాలోని 255 గ్రామ పంచాయితీల్లో సంబురాలను అంబరాన్ని అంటేలా పండుగ వాతావరణంలో నిర్వహించారు.

బతుకమ్మలతో ర్యాలీలు నిర్వహించి, గ్రామ పంచాయితీ కార్యాలయం వద్దకు చేరి, గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమం అమలు ద్వారా జరిగిన అభివృద్ధిని చర్చించారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై24, బుధవారం 2024