తెలంగాణ టెట్‌ దరఖాస్తుల గడువు మళ్ళీ పొడిగింపు

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌( Telangana TET ) కు దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది.

ఈ నెల 20 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది.గతంలో పేర్కొన్న గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

9వ తేదీ నాటికి 1.93 లక్షల మందే టెట్‌కు దరఖాస్తు చేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో 2012 నుంచి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015 నుంచి ఈ అర్హత పరీక్ష నిర్వహిస్తున్నారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 2.50 లక్షలమంది అర్హత సాధించారు.

త్రివిక్రమ్ సినిమాల్లో ఆ రోల్స్ లో నటిస్తే నష్టమేనా.. ఇంతమంది హీరోయిన్లు నష్టపోయారా?