తెలంగాణలో టెన్త్ ఫలితాలు విడుదల
TeluguStop.com
తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితా( Tenth Results Released )లు విడుదల అయ్యాయి.
ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో సెక్రటరీ బుర్రా వెంకటేశం రిజల్ట్ ను ప్రకటించారు.
కాగా టెన్త్ ఫలితాలలో బాలికలదే పై చేయి అని వెంకటేశం తెలిపారు.ఈ రిజల్ట్ లో మొత్తం 91.
31 శాతం ఉత్తీర్ణత వచ్చిందన్నారు.అదేవిధంగా 99.
09 ఉత్తీర్ణత శాతంతో నిర్మల్( Nirmal ) తొలిస్థానంలో నిలవగా.వికారాబాద్ లో అత్యల్ప ఉత్తీర్ణత శాతం వచ్చింది.
అలాగే రాష్ట్రంలో సుమారు 3,927 పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.తెలంగాణలో టెన్త్ పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకూ జరిగిన సంగతి తెలిసిందే.
సుమారు ఐదు లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.వీరిలో బాలురు 2,57,952 మంది కాగా బాలికలు 2,50,433 మంది ఉన్నారు.