తెలంగాణ టీడీపీ ఏకగ్రీవ తీర్మానం

తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని తెలుస్తోంది.తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతూ టీడీపీ నేతలు తీర్మానం చేశారు.

ఈ తీర్మానాన్ని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ అధినేత చంద్రబాబుకు పంపనున్నారు.

ఈ మేరకు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీ.టీడీపీ నేతలతో ఆయన సమావేశం అయిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే నేతలతో చర్చించిన అనంతరం పోటీ అంశంపై ఏకగ్రీవ తీర్మానం చేశారు.

ఇప్పటికే పోటీ అంశంపై కాసాని చంద్రబాబుతో చర్చలు జరపగా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పోటీ వద్దన్నట్లు తెలుస్తోంది.

వీడియో వీడియో: కింగ్‌ కోబ్రా పుట్టుకను చూసారా ఎప్పుడైనా?