చంద్రబాబును కలవనున్న తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు..!
TeluguStop.com
స్కిల్ డెవపల్ మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో చంద్రబాబుతో కుటుంబ సభ్యులు ములాఖత్ కానున్నారు.ఈ మేరకు చంద్రబాబుతో ఆయన కుటుంబసభ్యులతో పాటు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కూడా ములాఖత్ కానున్నారు.
ఇందులో భాగంగా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోనున్నారు.అదేవిధంగా తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ప్రకటన వంటి అంశాలపై చంద్రబాబుతో కాసాని చర్చించనున్నారని సమాచారం.
దాంతో పాటుగా టీడీపీ, జనసేన పొత్తు, సీట్ల సర్దుబాటు అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.
కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?