సండ్రా... ఒక్కసారి ఆలోచించు ! బుజ్జగిస్తున్న టీటీడీపీ నేతలు

సత్తుపల్లి టీడీపీ ఎమ్యెల్యే సండ్ర వీరయ్య టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.

ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయం అయింది.ఈ నెల 26 న ఆయన ఆ పార్టీలో చేరబోతున్నట్టు కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ సీనియర్ నాయకులూ రంగంలోకి దిగి అయన పార్టీ మారకుండా శతవిధాలా నచ్చచెప్పుతున్నారు.

ఈ మేరకు .సండ్ర వెంకటవీరయ్యతో చర్చలు జరిపారు.

పార్టీ ఆయనకిచ్చిన ప్రాధాన్యాన్ని గుర్తు చేయడంతోపాటు టీఆర్‌ఎస్‌లో చేరితే ఆయన రాజకీయ భవితవ్యం ఎలా మారే అవకాశం ఉంటుందో కూడా నేతలు వివరించినట్లు సమాచారం.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఇప్పటికే టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన సీనియర్లు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారో నేతలు సండ్ర దృష్టికి తీసుకొచ్చారు.

అయితే తాను ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని ఈ సందర్భంగా సండ్ర.వారికి చెప్పినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా తాజా ఎన్నికల్లో ఓటమిపాలైన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సండ్రను టీఆర్‌ఎస్‌లోకి తీసుకొచ్చే బాధ్యతను అప్పగించారని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అదీకాకుండా.సండ్రను గులాబీ గూటికి చేరిస్తే తుమ్మలకు మంత్రి పదవి దక్కే అవకాశం కూడా ఉండదట.