కొనసాగుతున్న సూపర్ స్ప్రెడర్స్ స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్..!

తెలంగాణాలో స్పెషల్ వ్యాక్సిన్ డ్రైవ్ కొనసాగుతుంది.నిత్యావసరాలకు బయట తిరుగుతున్న వ్యాపారులను సూపర్ స్ప్రెడెర్స్ గా గుర్తించి వారికి టోకెన్ సిస్టెం ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు.

ఈ నెల 28 నుండి ఈ స్పెషల్ వ్యాక్సిన్ డ్రైవ్ మొదలవగా మూడవ రోజు వ్యాక్సిన్ డ్రైవ్ కొనసాగుతుంది.

జి.హెచ్.

ఎం.సి పరిధిలో ఇప్పటివరకు 43వేల మందికి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది.

ప్రభుత్వ అధికారులు ఈ స్పెషల్ డ్రైవ్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు.టోకెన్ల్ల పంపిణీలో కొన్ని అవకతవాలు జరిగాయని అధికారుల నోటీస్ కు వచ్చింది.

వెంటనే అధికారులు చర్యలు తీసుకుని తిరిగి యధావిధిగా వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు.10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ వ్యాక్సిన్ ప్రక్రియలో సూపర్ స్ప్రెడర్స్ గా గుర్తించిన వారందరు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలని చెబుతున్నారు.

ఈ స్పెషల్ వ్యాక్సిన్ డ్రైవ్ 150 డివిజన్లలో మరో వారం రోజుల పాటు కొనసాగుతుంది.

రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేశారు.మొన్నటివరకు 45 ఏళ్ల వయసు గల వారికే వ్యాక్సిన్ వేయగా లేటెస్ట్ గా 18 నుండి 44 మధ్య వయసు గల వారికి మొదటి డోస్ వ్యాక్సిన్ వేయండని ప్రకటించింది.

ఓ పక్క స్పెషల్ డ్రైవ్ లో భాంగా సూపర్ స్ప్రెడర్స్ కు వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతుంది.

ఏపీలో ఈసీ నిర్ణయం..విధుల్లోకి అంగన్వాడీలు, కాంట్రాక్టు ఉద్యోగులు..!