యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామీ వారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రజా ఆరోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ రావు..

తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామీ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రజా ఆరోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ రావు.

ముందుగా ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వస్తి స్వాగతం పలికారు ఆలయ అర్చకులు.అనంతరం స్వయంభు మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలు నిర్వహించారు.

అనంతరం స్వామి వారి సన్నిధిలో ఆశీర్వచనం చేశారు ఆలయ అర్చకులు.అనంతరం స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని అందచేశారు ఆలయ అధికారులు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.ఆలయాని ఎంతో అద్భుతంగా రూపొందించారని ఇంతటి విశిష్టతను కలిగిన ఆలయాని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు.

శిల్పకళతో ఎంతో నైపుణ్యాన్ని కలిగిన ఆలయాన్ని సందర్శించి సంతోషాన్ని వ్యక్తం చేశారు.కరోనా వైరస్ వల్ల రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కున్నారని, దాని బారినుండి బయట పడామని ప్రజలందరు ఆరోగ్యం ఉండాలని స్వామి వారిని కోరుకున్నట్లు డాక్టర్ శ్రీనివాస్ రావు తెలిపారు.

దేవర సినిమాకు నెగిటివ్ రివ్యూ ఇవ్వమని డబ్బులు ఇచ్చారు….పూల చొక్కా నవీన్ షాకింగ్ కామెంట్స్!