తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై..

కరొనా బారినుంచి త్వరలో బయటపడాలని, ప్రజలంతా తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని, అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని సంక్రాంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు గవర్నర్ తమిలి సై.

ఈ ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని తెలంగాణ, పాండిచ్చేరి గవర్నర్ తమిలిసై సౌందర్ రాజన్ దంపతులు శ్రీవారిని దర్శించుకొని మ్రొక్కులు చెల్లించుకున్నారు.

వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లను చేశారు.దర్శనం అనంతరం రంగ నాయక మంటపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి లడ్డు ప్రసాధాలతో పాటు నూతన సంవత్సర క్యాలండర్ డైరీని అందచేశారు.

అమెరికాలో PhD వదిలేసి.. రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్.. ఈ చైనా వ్యక్తి కథ తెలిస్తే మైండ్ బ్లాకే..