Telangana : కాంగ్రెస్ కు షాకేనా..ఎంపీ ఎలక్షన్స్ కు బిజెపి సరికొత్త ప్లాన్..!

తెలంగాణ ( Telangana ) రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త మార్పు వచ్చింది.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 6 గ్యారంటీలు అమలు చేయడం కోసం ముందుకు వెళ్తోంది.

ఇదే తరుణంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి బిఆర్ఎస్, బిజెపి రాబోవు ఎన్నికలపై దృష్టి పెట్టింది.

"""/" / ముఖ్యంగా రాబోయే లోక్ సభ ఎన్నికల్లో( Lok Sabha Elections ) ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ కు దీటుగా సత్తా చాటాలని ఎవరి ప్లాన్ లో వారు ఉన్నారు.

ఈ క్రమంలోనే బిజెపి ( BJP ) పార్టీ మాత్రం ఒక కొత్త ప్లాన్ కు శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తోంది.

ఆ ప్లాన్ వర్కవుట్ అయితే మాత్రం ఎక్కువ మొత్తంలో సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉంది.

ఇంతకీ ఆ ప్లాన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి 2019 ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు రాబట్టింది.

నాలుగు సీట్లున్నటువంటి అసెంబ్లీ సీట్లను 8 సీట్లకు పెంచుకుంది.అంటే తెలంగాణలో బిజెపి కాస్త పుంజుకుంది అని చెప్పవచ్చు.

ఇది దృష్టిలో పెట్టుకున్నటువంటి బిజెపి హై కమాండ్ లోక్ సభ ఎన్నికలపై ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోంది.

"""/" / ఈసారి లోక్ సభలోకి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి ఈటల రాజేందర్( Etela Rajender) , ధర్మపురి అరవింద్, బండి సంజయ్, కిషన్ రెడ్డి లాంటి నాయకులతోపాటు మరి కొంతమంది స్టేట్ లీడర్లను బరిలోకి దింపనుంది.

అంతేకాకుండా ఈసారి తెలంగాణలో వారి అభ్యర్థులను కూడా ముందుగానే ప్రకటించుకొని , అన్ని రకాల ప్లాన్ లతో ముందస్తుగానే ఎన్నికల బరిలోకి వెళ్లాలని చూస్తోంది.

అయితే మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓటమిపాలైనటువంటి కొంతమంది అభ్యర్థులు తప్పకుండా ఎంపీ ఎలక్షన్స్ లో విజయం సాధిస్తారని ధీమాతో ఉంది.

కాబట్టి కాంగ్రెస్ ( Congress) కు దీటుగా లోక్ సభ అభ్యర్థులను పెట్టి గెలుపు సాధించాలనే ఆలోచనతో బిజెపి పావులు కలుపుతున్నట్టు సమాచారం.

సూపర్ స్టార్ మహేష్ బాబును ఢీ కొట్టే విలన్ అతనే.. చివరకు అతనికే ఛాన్స్ దక్కిందా?