Telangana Shakunthala: నటులు నటించగలరు.. దర్శకులు గుర్తించాలి..అప్పుడే అద్భుతాలు వస్తాయి
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది చాలా అద్భుతంగా నటిస్తారు.కానీ వాళ్ళని దర్శకులు గుర్తించి వారికి మంచి పాత్ర ఇస్తే సినిమాలో ఆ పాత్రకి ప్రత్యేక గుర్తింపు వస్తుంది.
ఒక నటుడి కి నటనలో ఎన్నో వేరియేషన్స్ ఉంటాయి.తాజాగా ఇండస్ట్రీలో ఎప్పుడు నవ్వించే పాత్రలు చేసిన నటులు ఎమోషనల్ సీన్స్ లో కూడా నటించి కన్నీళ్లు పెట్టిస్తున్నారు.
ఇలా ఎంతో మంది నటులు సినిమాలోని సీన్స్ కి తగ్గట్టు అద్భుతంగా నటించగలరు.
వాళ్ళని కరెక్ట్ గా వాడుకుంటే ఆ డైరెక్టర్స్ కి ఇక తిరుగుండదు.మహేష్ బాబు(
Mahesh Babu ) లాంటి స్టార్ హీరో కెరీర్ లో ఒక్కడు, పోకిరి సినిమాలు టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు.
"""/" /
ఒక్కడు సినిమా( Okkadu Movie ) ఇప్పటికి, ఎప్పటికి ఒక క్లాసిక్.
ఆ సినిమాలో కొండారెడ్డి బురుజు ఎంత ఫేమస్ అయ్యిందో మన అందరికి తెలిసిందే.
ఆ సినిమా తరువాత మళ్ళీ తాజాగా మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ సినిమాలో కొండారెడ్డి బురుజుని హైలైట్ చేసారు.
అయితే ఒక్కడు సినిమా గురించి మాట్లాడిన ప్రతిసారి ప్రతి ఒక్కరు మహేష్ బాబు, భూమిక, ప్రకాష్ రాజ్ గురించి, వారి నటన గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు.
కానీ ఈ సినిమాలో మరో అద్భుతమైన పాత్రకి డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చాడు.అదే తెలంగాణ శకుంతల( Telangana Shakuntala ) పాత్ర.
ఈ సినిమాలో శకుంతల ఎక్కువ సేపు కనిపించరు.కేవలం 5 - 6 సీన్ లలో మాత్రమే కనిపిస్తారు.
అయితే ఈ సీన్స్ లలో శకుంతల అద్భుతంగా నటించారు.నటులు ఎప్పుడు అవకాశం వచ్చినా ఆ ఛాన్స్ ని వదులుకోరు.
ఆ పాత్రలో విజృంభిస్తారు. """/" /
ఇలానే ఒక్కడు సినిమాలో శకుంతల తన పాత్రలో అదరగొట్టారు.
'నీ వల్ల కాకపోతే సెప్పు! జమ్మలమడుగు నుంచి ఓ లారీ.ఆళ్లగడ్డ నుంచి ఓ లారీ దింపేత్తాను అంటూ ఆమె చెప్పిన డైలాగులకు అభిమానులు విజిల్స్ వేశారు.
నిజానికి ఒక్కడు సినిమాలో తెలంగాణ శకుంతల పాత్ర అవసరం లేదు.ఆమె లేకపోయినా సినిమా హిట్ అయ్యేది కానీ దర్శకుడు ఆ పాత్రని అద్భుతంగా తీసి మంచి నటిని గుర్తించారు అనే చెప్పాలి.
ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంది నటులు ఉన్నారు.వారిని దర్శకులు కరెక్ట్ గా వాడుకుంటే వారు గొప్పగా నటించగలరు.
ప్రభాస్ ఫౌజీ సినిమా షూటింగ్ ఎక్కడెక్కడ జరుగుతుందంటే..?