టీ టీడీపీకి భారీ షాక్ .. ఆ సీనియర్ నేత ఏ పార్టీలోకి వెళ్తున్నారంటే..?
TeluguStop.com
ఒకప్పుడు టిడిపి(TDP) ఉమ్మడి రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఉండేది.ఈ పార్టీకి ఎంతోమంది కార్యకర్తలు కూడా ఉండేవారు.
అలాంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో చాలావరకు తగ్గిపోయింది.హైదరాబాద్,(Hyderabad) ఖమ్మం(Khammam) వంటి కొన్ని జిల్లాల్లో తప్ప మరెక్కడ కనిపించడం లేదు.
అలాంటి తెలంగాణ టిడిపి పార్టీకి, మరో షాక్ తగిలింది.ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి(Ravula Chandrashekar Reddy) మరో పార్టీకి వెళ్లేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది.
ఇంతకీ ఆయన ఏ పార్టీలోకి వెళ్తున్నారయ్యా అంటే.ఆయన బలంగా ఉన్న బిఆర్ఎస్(BRS) పార్టీలోకి వెళ్లనునట్టు సమాచారం.
"""/" /
ఈనెల 15వ తేదీలో ఆయన నిర్ణయం తీసుకుంటారని ఆయన సన్నిహిత వర్గాలు తెలియజేస్తున్నాయి.
1994, 2009లో వనపర్తి(Wanaparthi) నుంచి టిడిపి(TDP) ఎమ్మెల్యేగా విజయం సాధించిన చంద్రశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విప్ గా, రాజ్యసభ సభ్యుడిగా(MP) కొనసాగారు.
ఇక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన ఎంతోమంది టీడీపీ నాయకులు పార్టీని విడిచిపెట్టి ఇతర పార్టీలో చేరిన కానీ, """/" /
ఆయన టిడిపి మీద ఉన్న గౌరవంతో అదే పార్టీని అడ్డుపెట్టుకొని ఉన్నారు.
ప్రస్తుతం టిడిపి తెలంగాణ పోలీస్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతూ వస్తున్నారు.ఇదే తరుణంలో ఆయన రాజకీయ భవిష్యత్తు కాస్త ఇబ్బందుల్లో పడిందట.
దీంతో ఆయన ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ (BRS) లో తీర్థం పుచ్చుకుంటారని, త్వరలోనే ఆయన చేరిక జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
బడ్జెట్ 6 లక్షలు.. కలెక్షన్లు 800 కోట్లు.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?