పెద్ద పదవిపైనే హనుమంతన్న కన్ను ? నోటికి తాళం అందుకేనా ?

తమ రాజకీయ ప్రత్యర్థుల పైనే కాదు, సొంత పార్టీ నేతల పైన తనదైన శైలిలో విమర్శలు చేసే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు( V Hanumantha Rao ) ప్రస్తుతం బాగా సైలెంట్ అయ్యారు.

ఎక్కడా ఏ విషయం పైన ఆయన స్పందించడం లేదు.కాంగ్రెస్( Congress Party ) తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత వీహెచ్ వ్యవహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు.

ఎప్పుడు ఏదో విషయంపై స్పందిస్తూ ఉండే విహెచ్ ఎందుకు ఇలా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు అనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.

గతంలోనూ రేవంత్ రెడ్డి పై( Revanth Reddy ) అనేకసార్లు బహిరంగంగానే విమర్శలు చేశారు.

అయినా వీహెచ్ చేసే విమర్శలకు కాంగ్రెస్ సీనియర్లు సైతం మౌనంగానే ఉంటూ ఉంటారు.

"""/" / దీనికి కారణం విహెచ్ కు కాంగ్రెస్ అధిష్టానం పెద్దల వద్ద మంచి పలుకుబడి ఉండడం, ఇక్కడ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, నేతల వైఖరి పై తరచుగా ఆయన అధిష్టానం పెద్దలకు ఫిర్యాదులు, లేఖలు రాస్తూ ఉండడం వంటి కారణాలతో విహెచ్ జోలికి వెళ్లేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవరు సాహసించరు.

ఇదిలా ఉంటే ఉన్నట్టుండి విహెచ్ సైలెంట్ అవ్వడానికి కారణాలు చాలానే ఉన్నాయి.ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో, అందరూ నామినేటెడ్ పదవులు( Nominated Posts ) కోసం పైరవీలు చేస్తున్నారు.

అయితే రాష్ట్రస్థాయిలో పదవులు తీసుకునేందుకు వీహెచ్ సిద్ధంగా లేరు.ఆయన చూపు ఢిల్లీ వైపు మళ్ళిందనే ప్రచారం జరుగుతోంది.

"""/" / త్వరలోనే రాజ్యసభ పదవులు( Rajyasabha Seat ) భర్తీ కానుండడంతో, బీసీ కోటా తో పాటు ,సీనియర్ నేతగా తనకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తారనే ఆశలతో వీహెచ్ ఉన్నారు.

అందుకే కొద్ది రోజులుగా ఎవరిపైనా విమర్శలు చేయడం లేదు.రేవంత్ రెడ్డి జోలికి అస్సలు వెళ్లడం లేదు.

రేవంత్ తో విరోధం పెట్టుకుంటే.తాను ఆశిస్తున్న పదవికి ఎసరు వస్తుందనే భయము వీహెచ్ లో కనిపిస్తుంది.

అందుకే రాజ్యసభ సభ్యత్వం దక్కే వరకు ఎటువంటి వివాదాలకు వెళ్ళకూడదని, అందరిని కలుపుకుని వెళ్లే విధంగానే ఉండాలని పీహెచ్ నిర్ణయించుకున్నారట.

ఖైదీలను సింహాలకు ఆహారంగా వేసేవాడు.. ఎక్కడో తెలిస్తే..