కరోనాని కట్టడి చేసేందుకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక చర్యలు..!

కరోనా వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో మన ప్రభుత్వాలు ఎన్నో రకాల చర్యలు చేపడుతున్నాయి.

కరోనా కారణంగా ఎంతో మంది చనిపోయారు.ఇప్పటికి కరోనా వైరస్ వ్యాప్తి తగ్గలేదు.

మళ్ళీ కరోనా పంజా విసురుతుంది.ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సైతం కరోనా థర్డ్ వేవ్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.

కరోనాని కట్టడి చేయాలంటే మాస్క్ తప్పనిసరి అని.ప్రభుత్వాలు నెత్తి నోరు కొట్టుకుంటున్నాయి.

అయినా గాని కొంతమంది మాస్క్ ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.ఈ క్రమంలోనే తెలంగాణ ఆర్టీసీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ ఆర్టీసీ ఎండీగా విసి సజ్జనార్ బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి ఎన్నో రకాల మార్పులు చేసి ఆర్టీసీని మునుపటి కంటే మరింత మెరుగ్గా తీర్చిదిద్దారు.

ఆర్టీసీని గాడినపెట్టేందుకు, ప్రయాణికులు సౌకర్యంగా ప్రయాణం చేసేందుకు చర్యలు చేపట్టారు.ఈ క్రమంలోనే మరొకమారు ప్రయాణికుల ఆరోగ్యాన్ని కాపాడేందుకుగాను మరొక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది తెలంగాణ ఆర్టీసి.

రోజు రోజుకు కరోనా వైరస్ తన కోరలు విసురుతూనే ఉంది.తెలంగాణలో సైతం కరోనా థర్డ్ వేవ్ వ్యాప్తి అధికంగా ఉన్న కారణం చేత తెలంగాణ ఆర్టీసీ అప్రమత్తమయ్యింది.

ప్రయాణికుల భద్రతను, ఆరోగ్యాన్ని దృష్టిలో వుంచుకుని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే ప్రతి ప్రయాణికుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచనలు చేసారు.

"""/"/ ఒకవేళ మాస్క్ ధరించకుండా బస్సుల్లో ప్రయాణిస్తే వారికి ఫైన్ విధిస్తున్నారు ఆర్టీసీ సిబ్బంది.

అసలే పండగ సీజన్.బస్సులు అన్ని కూడా ప్రయాణికులతో రద్దీగా ఉంటాయి.

అలాగే సొంతూళ్లకు వెళ్ళే ప్రయాణికులతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉండడం వలన కరోనా వ్యాప్తి అనేది ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది.

అలా జరగకుండా ఉండేందుకు ముందస్తుగా తెలంగాణ ఆర్టీసీ మాస్కు తప్పనిసరి చేసింది.మాస్కు ధరించకుండా బస్సులో ప్రయాణించే వారికి రూ.

50 జరిమానా విధిస్తున్నారు.ఇప్పటికే కొంతమంది "బస్సులలో మాస్క్ ఫైన్" సైతం చెల్లించినట్లు తెలుస్తుంది.

ఈ ఒక్క హీరోకి తప్ప శృతిహాసన్ టాలీవుడ్ లో అందరికి హిట్స్ ఇచ్చింది..!