కేసీఆర్ పై మరో ఉద్యమానికి సన్నద్దం అవుతున్న తెలంగాణ రిటైర్టు ఉద్యోగులు.. !?

తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త ఉద్యమం ఊపిరి పోసుకుంటుందా అంటే అలాంటి అవకాశాలు ఉన్నాయనే సమాధానం వినిపిస్తుంది.

ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 2021 మార్చి 22న అసెంబ్లీలో, ఉద్యోగుల వయో పరిమితిని 58 సంవత్సరాల నుంచి 61 ఏళ్ళకు పెంచుతున్నట్లు ప్రకటించారు.

కాగా ఈ ఆదేశాలు ప్రకటించిన రోజు నుండే అమల్లోకి వస్తాయని కూడా వెల్లడించారు.

అయితే ఈ వయో పరిమితి ప్రకటనను ఏ ప్రాతిపదికన ప్రకటించారని సీఎం కేసీఆర్‌ను రిటైర్డు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

అంతే కాకుండా, సీఎం కేసీఆర్ స్వయంగా ఈ ఆదేశాలు ప్రకటించిన 2021 మార్చి 22 నుంచే అమల్లోకి వస్తాయని అసెంబ్లీలో చెప్పడంతో.

2021 ఫిబ్రవరి వరకూ రాష్ట్రంలో రిటైర్డు అయిన ఉద్యోగుల ఆశలపై ఒక్కసారిగా నీళ్లు చల్లినట్టు అయ్యిందట.

దీంతో వీరంతా రాష్ట్రంలో మరో ఉద్యమానికి సన్నద్దం అయ్యే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం.

ఇకపోతే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లకు వయో పరిమితి పెంచుతామని మేనిఫెస్టో ప్రవేశపెట్టగా.

టీఆర్ఎస్ పార్టీ 61 ఏళ్లకు పెంచుతామని మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే.

బాహుబలి తర్వాతే అసలు కష్టాలు మొదలయ్యాయి.. తమన్నా షాకింగ్ కామెంట్స్!