నిరుద్యోగంలో తెలంగాణ మొదటిస్థానం.. వైఎస్ షర్మిల

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో ఆత్మహత్యకు పాల్పడిన నవీన్ కుటుంబాన్ని వైఎస్ఆర్ టీపీ అధినేత్రి షర్మిల పరామర్శించారు.

నిరుద్యోగంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందని విమర్శించారు.బిశ్వాల్ కమిటీ నివేదికను కూడా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని షర్మిల మండిపడ్డారు.

కార్పొరేషన్ లోన్లు అప్లై చేసుకున్నా ఇవ్వడం లేదని చెప్పారు.బంగారు తెలంగాణలో ఉద్యోగాలు ఎక్కడ పోయాయని తెలిపారు.

పేపర్ లీక్ తో ఐటీ శాఖకి సంబంధం లేదని కేటీఆర్ అనడం సిగ్గుచేటని పేర్కొన్నారు.

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో ఇద్దరికి మాత్రమే తెలిపే పాస్ వర్డ్ అందరికి ఎలా తెలిసిందని ప్రశ్నించారు.

వైరల్: రోడ్డుపై బైక్‌ స్టంట్స్.. ట్రక్కు ఎదురుగా వచ్చేసరికి?