నాని తీరును తప్పుబట్టిన టీ నిర్మాతల మండలి

నేడు థియేటర్ల అసోషియేషన్ మరియు తెలంగాణ నిర్మాతల మండలి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

లవ్ స్టోరీ సినిమాను థియేటర్ల ద్వారా విడుదల చేస్తూ ఉన్న ఈ సమయంలో టక్ జగదీష్ ను అదే సమయంలో ఓటీటీ ద్వారా విడుదల చేయడం పోటీ అన్నట్లుగా వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.

తెలుగు సినిమా బాగు పడాలి.తెలుగు సినిమా థియేటర్లలో జనాలు మళ్లీ కళకలలాడుతూ ఉండాలని కోరుకున్న నాని ఎందుకు తన సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేస్తున్నాడు అంటూ ప్రశ్నించాడు.

ఈ సందర్బంగా టీ నిర్మాతల మండలి నాయకులు మాట్లాడుతూ నాని తీరును తప్పుబట్టారు.

"""/"/ నాని ఇలా చేయడం ఏమాత్రం సబబు కాదు.ఒక బాధ్యత కలిగిన వ్యక్తి ఇలా చేస్తాడని నేను ఊహించలేదు అంటూ అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది.

నాని తో పాటు ఇంకా కొందరు కూడా తమ సినిమాలను ఓటీటీ లో విడుదలకు సిద్దం చేస్తున్నారు.

వారంతా కూడా తమ సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేయకుండా థియేటర్ల ద్వారా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇక థియేటర్లలో సినిమాను విడుదల చేసే సమయంలో ఓటీటీ లో సినిమాలను విడుదల చేయాలని నిర్మాతల మండలి నాయకులు డిమాండ్‌ చేశారు.

ఒకే సారి అక్కడ ఇక్కడ సినిమాలు విడుదల అయితే థియేట్రికల్ రిలీజ్ అయిన సినిమాల ను జనాలు పట్టించుకోరు అంటూ అనుమానం వ్యక్తం చేశారు.

నాని సినిమా విడుదల తేదీని మార్చడం లేదా ప్లాట్‌ ఫామ్‌ మార్చడం చేయాలంటూ డిమాండ్‌ చేశారు.

నాని తీరుపై ఇండస్ట్రీ వర్గాల వారు మరియు అభిమానులు కూడా కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

 నాని శ్యామ్‌ సిగరాయ్ కూడా ఓటీటీ అంటూ వస్తున్న వార్తలను యూనిట్‌ సభ్యులు కొట్టి పారేశారు.

ఏపీ కొత్త డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా నియామకం