తెలంగాణా ఉద్యోగుల‌కు గుడ్‌న్యూస్.. పీఆర్సీ ఉత్త‌ర్వులు జారీ..!

తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.కొత్త వేతన సవరణ అమలుకు ఇప్పటికే కేబినెట్ ఆమోదం తెలుపగా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.

జూన్ నెల నుండి పెంచిన పీ.ఆర్.

సీ ని అమలు చేసి వేతనాలు చెల్లించాలని నిర్ణయించారు.2018 జూలై నుండి నోషనల్ బెనిఫిట్, 2020 ఏప్రిల్ 1 నుండి మానిటరీ బెనిఫ్ట్, 2021 ఏప్రిల్ 1 నుండి క్యాష్ బెనిఫిట్ అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించగా శుక్రవారం వీటికి సంబందించిన ఉత్తర్వులు జారీ చేసింది.

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా 30 శాతం పీ.ఆర్.

సీ వర్తింపచేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది తెలంగాణా ప్రభుత్వం.పెన్షనర్లకు మెడికల్ అలవెన్స్ 350 నుండి 600 వరకు పెంచారు.

రిటైర్మెంట్ గ్రాట్యుటీ 12 లక్షల నుండి 16 లక్షల వరకు పెంచారు.15 శాతం పెన్షన్ పెంపుని 75 సంవత్సరాల నుండి 70 ఏళ్లకు తగ్గించింది.

ఉద్యోగుల కనీస వేతనం 19 వేలుగా నిర్ణయించింది.ప్రస్తుతం ఉన్న 32 గ్రేడ్లు, 80 సెగ్మెంట్లు కొనసాగించింది.

 రాష్ట్ర ఉద్యోగులు కొన్నాళ్లుగా పీ.ఆర్.

సీ గురించి ఎదురుచూస్తున్నారు.ఈమహ్య కేబినెట్ మీటింగ్ లో పీ.

ఆర్.సీ పై పాజిటివ్ గా స్పందించిన సిఎం కే.

సి.ఆర్ ఈలోగా పి.

ఆర్.సీ ప్రకటించడం ఉద్యోగులను ఖుషి చేస్తుంది.

నేడు తెలంగాణ కాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదల