మిగిలింది నాలుగు రోజులే ! గెలుపెవరిది ? 

తెలంగాణలో ఈనెల 30వ తేదీన హుజురాబాద్ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది.అంటే సరిగ్గా వారం రోజుల్లో ఓటర్ తీర్పు ఎలా ఉండబోతుంది అనేది తేలిపోనుంది.

ఇక ఎన్నికల ప్రచారానికి నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండడంతో,  అన్ని రాజకీయ పార్టీలు హడావుడిగా ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తున్నాయి.

భారీ బహిరంగ ప్రచారానికి నాలుగు రోజుల్లో ముగింపు పలకాల్సిన రావడంతో, ప్రతి నిమిషం విలువైనది గానే అన్ని పార్టీలు భావిస్తున్నాయి.

టిఆర్ఎస్,  బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ మధ్య పోరు అత్యంత ప్రతిష్టాత్మకం కావడంతో గెలుపు కోసం బిజెపి టిఆర్ఎస్ గట్టిగానే కష్టపడుతున్నాయి.

         ఇప్పటికే ఈ నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారో అనే ఈ విషయంపై అనేక సంస్థలు సర్వేలు నిర్వహించాయి.

అయితే ఒక్కోసారి ఒక్కో విధంగా సర్వే రిజల్ట్ రావడంతో అసలు విషయం ఏమిటనేది ఎవరికీ అంతుపట్టడం లేదు.

ఇక సర్వేల్లో టిఆర్ఎస్ అభ్యర్థి గేల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుస్తారని రిజల్ట్ రాగా మరో సర్వేలో బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుస్తారని సర్వే రిపోర్టులు వస్తున్నాయట.

దీంతో అసలు విషయం ఏమిటనేది ఎవరికీ అంతుపట్టడం లేదు.  అదీకాకుండా దీనికి సంబంధించిన సర్వేల ఫలితాలు వెల్లడించడం పై ఆంక్షలు ఉండడంతో ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు అనేది కాస్త టెన్షన్ కలిగిస్తోంది.

మరో నాలుగు రోజుల పాటు ఎన్నికల ప్రచారాన్ని పకడ్బదీగా అన్ని పార్టీలు నిర్వహిస్తున్నాయి ఓటర్లను తమ దారికి తెచ్చుకునే విధంగా అన్ని మార్గాలు వెతుకుతున్నాయి.

    """/"/      ఇప్పటికే ఈ నియోజకవర్గ పూర్తి బాధ్యతలు అన్నీ మంత్రి హరీష్ రావు తీసుకున్నారు.

టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి ఈటల రాజేందర్ ను ఓడించడమే ఆయన ధ్యేయంగా పెట్టుకున్నారు.

టిఆర్ఎస్ ఎత్తుగడలు తట్టుకుంటూ తన గెలుపుకు బట్టలు వేసుకునే పనులు రాజేందర్ నిమగ్నమయ్యారు.

ఇది ఇలా ఉంటే, కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో వెనుకబడినట్టే కనిపిస్తోంది.దీంతో ప్రధాన పోటీ అంతా బిజెపి టిఆర్ఎస్ మధ్య ఎక్కువగా ఉంది.

హుజూరాబాద్ నియోజకవర్గం లో మొత్తం 2.36 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.

కొత్త ఓటర్లుగా నమోదు చేసుకున్న వారు దాదాపు 20 వేల మంది వరకు ఉన్నారు.

మొత్తం ఓటర్లలో పురుషులు 1,17,779 , మహిళా ఓటర్లు 1,19,093 మంది ఉన్నారు.

ఇప్పటికే ఇంటిలిజెన్స్ వివిధ సర్వే సంస్థలు ఈ నియోజకవర్గంలో ఓటర్లు ఎటువైపు ఉన్నారు అనే విషయంపై  ఆరా తీస్తున్నా, స్పష్టమైన క్లారిటీ రాకపోవడం లేదు.

ఓటర్లు తాము ఎవరికి ఓటు వేస్తాము అనేది చెప్పేందుకు ఇస్టపడకపోవడం తో అన్ని పార్టీలకు ఈ నియోజకవర్గంలో ఫలితాలపై టెన్షన్ గానే ఉంది.

 .

గోడిచర్ల నుంచి సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర..!