షర్మిల పార్టీని వారెందుకు పట్టించుకోవడం లేదు ? 

వైఎస్ షర్మిల పాదయాత్ర చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.రెండు నెలల్లో ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్ ఆధారంగా పార్టీ పేరుని ప్రకటించేందుకు షర్మిల  సిద్ధం అవుతున్నారు.

తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటించి తమ పార్టీకి ఆదరణ పెంచుకోవాలని షర్మిల ప్రయత్నిస్తున్నారు.

తమతో కలిసి వచ్చే బంధువులు, స్నేహితులు ఇతర పార్టీల నాయకులు అందరితోనూ బలమైన పునాదులు వేసుకుని పార్టీని అధికారంలోకి తీసుకు రావాలని చూస్తున్నారు.

ఇప్పటివరకు పార్టీ పేరు ప్రకటించకపోవడంతో పెద్దగా చేరికలు కనిపించడం లేదు.కానీ షర్మిల పార్టీ పేరును ప్రకటించకుండానే బలమైన రాజకీయ శక్తిగా మారాలని చూస్తున్నారు.

దీనిలో భాగంగానే తెలంగాణలో బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను టార్గెట్ చేసుకుంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.

"""/"/ కానీ షర్మిల విమర్శలకు ఆయా పార్టీల నుంచి పెద్దగా రియాక్షన్ రాకపోవడం అందరినీ ఆలోచనలో పడేస్తోంది.

టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నిటినీ షర్మిల నిలదీస్తూ గుర్తుచేస్తున్నారు.నిరుద్యోగ సమస్యతో పాటు అనేక అంశాలను ప్రస్తావిస్తున్నారు వీటిపైన దీక్ష చేపట్టేందుకు సిద్ధమవుతున్నా,  ఊహించిన స్థాయిలో టిఆర్ఎస్ నుంచి రియాక్షన్ రావడం లేదు.

అలాగే పసుపు బోర్డు, ధరల పెరుగుదల వంటి అంశాల పైన బిజెపిని విమర్శిస్తున్నా, సదరు పార్టీల నుంచి పెద్దగా రియాక్షన్ రావడం లేదు.

రెండు రోజుల క్రితం షర్మిల ఖమ్మం లో నిర్వహించిన భారీ బహిరంగ సభలోనూ కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారు.

కానీ టీఆర్ఎస్ నుంచి రెస్పాన్స్ పెద్దగా లేదు.ఈ విమర్శలకు స్పందిస్తే అనవసరంగా ఆ పార్టీకి ప్రాధాన్యం పెంచినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో సైలెంట్ గా ఉండిపోయాయట.

 ఇక బీజేపీ సైతం ఇదే ఆలోచనతో ఉన్నా, పెద్దగా రియాక్ట్ కావడం లేదట.

మొదట్లో షర్మిల పార్టీ కి రెస్పాన్స్ బాగానే ఉన్నట్టు గా కనిపించినా, ఆ తరువాత పెద్దగా ఆ ఊపు కనిపించకపోవడం, ఇటీవల నిర్వహించిన భారీ బహిరంగ సభకూ స్పందన అంతంత మాత్రంగానే ఉండడం , ఇలా ఎన్నో అంశాలతో షర్మిల పార్టీ ఇక్కడ బలమైన పునాదులు వేసుకోలేవు అనే ఆలోచనతోనే మిగతా పార్టీలు ఏవీ ఈ విషయాలను పెద్దగా పట్టించుకోవడమే లేదట.

ఈ వారం థియేటర్, ఓటీటీ సినిమాలివే.. ఇన్ని హిట్ సినిమాలు రిలీజవుతున్నాయా?