పోలీసుల అదుపులో టీవీ9 మాజీ సీఈఓ

తెలుగు మీడియా రంగంలో ఒక సంచలనంగా పేరు దక్కించుకున్న టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్‌పై ప్రస్తుతం టీవీ9 యాజమాన్యం కేసులు పెట్టిన విషయం తెల్సిందే.

పోర్జరీతో పాటు, కంపెనీ నిధులను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నాలు చేయడం, బోనస్‌ పేరుతో కోట్ల రూపాయలను దారి మల్లించడం చేశాడంటూ ప్రస్తుత యాజమాన్యం కేసు పెట్టింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు రవి ప్రకాష్‌ను అదుపులోకి తీసుకుని విచారించింది.నేడు ఉదయం టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని జూబ్లీ హిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించి విచారణ జరిపారు.

రవిప్రకాష్‌ సీఈఓగా ఉన్న సమయంలో జరిగిన నగదు లావాదేవీల గురించి అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది.

గతంలో టీవీ9 సీఈఓగా ఒక వెలుగు వెలిగిన రవి ప్రకాష్‌ గత కొంత కాలంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కొత్త యాజమాన్యంతో ఈయనకు పొసగక పోవడంతో గందరగోళ పరిస్థితులు వచ్చాయి.దాంతో ఆయన్ను తొలగించడం జరిగింది.

ఆయన తొలగించిన తర్వాత కేసులు పెట్టి ఆయన అక్రమాలకు పాల్పడిన విషయాలను కొత్త యాజమాన్యం వెలుగులోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తోంది.

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు వైసీపీకే.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో వార్ వన్ సైడ్!