ఐటీ గ్రిడ్స్ అధినేత అశోక్ కి లుక్ ఔట్ నోటీసులు!

ఐటీ గ్రిడ్స్ సంస్థ మాటున ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీకి తెరతీసిన ఆ సంస్థ అధినేత అశోక్ పై సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి తెలంగాణ సైబరాబాద్ పోలీసులు సిద్ధం అయ్యారు.

ఐటీ గ్రిడ్స్ డేటా చోరీ కేసులో ఇప్పటికే విచారణకి హాజరు కావాలని అశోక్ కి నోటీసులు జారీ చేసారు.

అయితే ఇచ్చిన గడువులోగ అశోక్ నుంచి స్పందన లభించకపోవడం ఇప్పుడు అతనిని అరెస్ట్ చేయడానికి తెలంగాణ పోలీసులు రెడీ అవుతున్నాయి.

ఐటీ గ్రిడ్స్ పైన దాడి తర్వాత పరారిలో వున్న ఆ సంస్థ అధినేత అశోక్ ని అదుపులోకి తీసుకుంటే డేటా చోరీ కేసులో నిజానిజాలు బయటకి వచ్చే అవకాశం వుందని తెలియజేసిన సైబరాబాద్ సీపీ సజ్జనార్ అతనికి నోతీసులు జారీ చేసారు.

అయితే పోలీసులకి సమాధానం చెప్పడానికి అశోక్ అందుబాటులో లేకపోవడంతో అతనిని అరెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.

ఇక తాజాగా తెలంగాణ పోలీసులు అతనిపై లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేసారు.

అశోక్ దేశం విడిచి వెళ్ళిపోకుండా ఎయిర్ పోర్ట్ కి ఈ నోటీసులు పంపించారు.

మరి ఈ ఐటీ గ్రిడ్స్ కేసులో తెలంగాణ పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

డేటా చోరీలో ఇప్పటికే ఆసక్తికర నిజాలు బయటపెట్టిన టీఎస్ పోలీసులు మరిన్ని నిజాలు బయట పెడతారు అనేది చూడాలి.

అమెరికా : వైట్‌హౌస్‌లో మారుమోగిన ‘‘సారే జహాసే అచ్చా’’.. పులకించిన ఇండో అమెరికన్లు