రేవంతే పీసీసీ అధ్యక్షుడు …? కండిషన్స్ అప్లై

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఉనికి కోసం ఆరాటపడుతున్నా, పదవుల విషయంలో మాత్రం ఆ పార్టీ నాయకులు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు.

ఎన్నికల సమయంలోనూ, ప్రత్యర్థులపై విమర్శలు చేసేందుకు సైతం ముందుకు రాని నేతలు కూడా ఈ విషయంలో పోటీ పడి మరీ సొంత పార్టీ నాయకులపైన విమర్శలకు దిగుతూ, అసలు సిసలైన గ్రూపు రాజకీయాలు తెలంగాణ కాంగ్రెస్ లో ఏ విధంగా ఉంటాయి అనేది మరోసారి అందరికీ స్పష్టంగా అర్థమయ్యే విధంగా చేయడంలో సక్సెస్ అయ్యారు.

ఇక పార్టీ హైకమాండ్ సైతం నేతల తీరు తో బాగా విసిగి పోయింది.

ఇదిలా ఉంటే ఎన్ని అభ్యంతరాలు ఎదురైనా, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డికి ఆ పదవి ఇచ్చేందుకు దాదాపు అధిష్టానం డిసైడ్ అయిపోయింది.

ఈ మేరకు తెలంగాణలోని మెజార్టీ నాయకుల అభిప్రాయం కూడా దీనికి అనుకూలంగా ఉండడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

రేవంత్ పేరు ప్రకటించగానే తెలంగాణ కాంగ్రెస్ లో పెద్ద అలజడి ఎలాగూ రేగుతుందని, పెద్ద ఎత్తున పార్టీ మారేందుకు నాయకులు సిద్ధం అవుతారని, తీరని నష్టం చేకూరుతుందని, దానికి విరుగుడుగా రేవంత్ కు పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చినా.

కీలకమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో మిగతా నాయకుల ప్రమేయం కూడా ఉండే విధంగా సమన్వయ కమిటీని కూడా నియమించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ కమిటీలో పదవులు ఆశిస్తున్న వారందరిని చేర్చడం ద్వారా, అధ్యక్ష పదవి రాకపోయినా, కీలకమైన సమన్వయ కమిటీలో తమ మాట చెల్లుబాటు అవుతుందనే సంతృప్తి సదరు నాయకులలో ఏర్పడుతుందనే ఉద్దేశంతోనే సమన్వయ కమిటీని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.

పిసిసి అధ్యక్షుడి పేరు ప్రకటించిన వెంటనే సమన్వయ కమిటీని కూడా ప్రకటించేందుకు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు ఏర్పాట్లు చేస్తున్నారట.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??