తెలంగాణలో పంచాయితీ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ 

ఎప్పటి నుంచో తెలంగాణ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కు సంబంధించి ఆసక్తి నెలకొంటూనే వస్తోంది.

తెలంగాణలో కాంగ్రెస్( Congress ) అధికారంలోకి వచ్చిన మొదట్లోనే స్థానిక సంస్థలు ఎన్నికలను నిర్వహిస్తారని అంతా భావించినా, రకరకాల కారణాలతో అవి వాయిదా పడుతూ వచ్చాయి.

ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో సంతృప్తి నెలకొనడంతో ఇదే సరైన సమయంగా భావిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) వీలైనంత తొందరగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలనే పట్టుదలతో ఉన్నారు.

ఈ మేరకు త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు కసరత్తు మొదలుపెట్టారు.సర్పంచ్ ఎన్నికలకు( Sarpanch Elections ) డిసెంబర్ నెలలోని ముహూర్తం ఫిక్స్ చేసినట్లు గా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Minister Ponguleti Srinivas Reddy ) క్లారిటీ ఇచ్చారు.

  2025 జనవరి నెలలో గ్రామాలకు కొత్త సర్పంచ్ లు వస్తారంటూ మీడియా సమావేశంలో పొంగులేటి క్లారిటీ ఇవ్వడంతో ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్ గా ఉందనే విషయం అర్థం అవుతోంది.

"""/" / మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల జారీ చేశారు.

ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని, ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలు, ఆ తరువాత మున్సిపల్ ఎన్నికలు ఉంటాయని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.

తెలంగాణలో 12,751 గ్రామ పంచాయతీల పదవీకాలం ఈ ఏడాది జనవరిలోని ముగిసింది.అప్పటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన గ్రామాల్లో నడుస్తోంది.

పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో తెలంగాణకు రావాల్సిన 1800 కోట్ల నిధులు కేంద్రం వద్దనే ఉండిపోయాయి.

"""/" / దీంతో ఆ నిధులను తెచ్చుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.అందుకే వీలైనంత తొందరగా ఎన్నికలను నిర్వహించాలని భావిస్తుంది.

2025లో నిర్వహించబోయే అన్ని ఎన్నికలకు ఓటర్ల ముసాయిదా జరుగుతుంది.రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ రూపొందించింది.

ఈనెల 6 నుంచి సమగ్ర కుల గణన ప్రారంభం కానుంది.ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను త్వరలో ఎంపిక చేస్తామని ప్రకటించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

దీన్ని బట్టి చూస్తే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ముందు నుంచే తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది .

మెజార్టీ స్థాయిలో ఉన్న బీసీల మద్దతు కూడగట్టేందుకు బిసి గణన చేపట్టడం వంటివన్నీ స్థానిక సంస్థల ఎన్నికల కోసమే అనే విషయం అర్థం అవుతోంది.

ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే డిసెంబర్ లోనే పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది.

ఇబ్బందుల్లో గౌతమ్ అదానీ.. దోషిగా తేల్చిన అమెరికా కోర్టు