తీర్పు ఎలా ఉండబోతుందో ? టెన్షన్ పెడుతున్న మున్సి'పల్స్'

తెలంగాణలో మొన్నటి వరకు వాడివేడిగా రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం నిర్వహించాయి.మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు, ప్రభావితం చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగానే కష్టపడ్డాయి.

ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ రంగంలోకి దిగాయి.ఈ సందర్భంగా అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

రాజకీయ పార్టీలు ఒకరిని మించి మరొకరు ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల హామీలను మ్యానిఫెస్టో లో రూపొందించారు.

ఇదంతా పూర్తయైన తరువాత నేడు తీర్పు ఇచ్చేందుకు ప్రజలు సిద్ధమయ్యారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 120 మున్సిపాలిటీలు, 19 కార్పొరేషన్లలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

ఈరోజు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటలకు ముగుస్తుంది.

ఈ సందర్భంగా ఎక్కడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహిస్తున్నారు.

దీనికి సంబంధించిన అన్ని వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నాగిరెడ్డి తెలిపారు.

ఓటర్లు ఎటువంటి గందరగోళానికి గురికాకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇక కరీంనగర్ కార్పొరేషన్లో ఈనెల 24వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి.తెలంగాణలో మొత్తం 2727 మున్సిపల్ వార్డులు, 385 కార్పొరేషన్ వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2020/01/Telangana-Municipal-Elections-KTR-KCR-TRS-మున్సిపల్స్!--jpg"/ ఇప్పటికే టీఆర్ఎస్ ఏడు వార్డుల్లోనూ, ఎంఐఎం పార్టీకి మూడు వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

రాష్ట్రం మొత్తం మీద 7921 పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు.ఈ ఎన్నికల్లో 11 ,179 కౌన్సిలర్ అభ్యర్థులు, 1747 మంది కార్పొరేట్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

దీనికోసం 1250 మంది ఎన్నికల పరిశీలకులను నియమించారు.120 మున్సిపాలిటీల్లో 20 లక్షల 14 వేల 601 పురుష ఓటర్లు, 20 లక్షల 25 వేల 762 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.

ఇక 9 కార్పొరేషన్లలో 6 లక్షల 66 వేల 900 మంది పురుష ఓటర్లు, 6 లక్షల 48 వేల 232 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.

ఎన్నికల్లో గట్టెక్కేందుకు నాయకులంతా అలుపెరగకుండా కష్టపడ్డారు టిఆర్ఎస్ బిజెపి కాంగ్రెస్ పార్టీలు నువ్వానేనా అన్నట్టుగా ప్రచారం నిర్వహించి ప్రజలను ఆకట్టుకునే విధంగా తమ తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది.

అయితే ఓటర్లు ఏ విధంగా తీర్పు ఇస్తారో, ఏ పార్టీకి అత్యధిక స్థానాలు కట్టబెడతారో చూడాలి.

ఎన్నికల్లో ఎక్కువ మంది పోటీ చేయండి .. ఇండో అమెరికన్లకు కమలా హారిస్ సూచనలు