జగ‌న్‌ను గ‌జ‌దొంగ అంటున్న తెలంగాణ మంత్రులు.. కార‌ణ‌మేంది బాస్‌!

కేసీఆర్‌, జ‌గ‌న్ మ‌ధ్య ఇప్ప‌టి వ‌ర‌కు మంచి స‌న్నిహిత్య‌మే ఉంది.ఇరువురు క‌లిసి ఎన్నో విష‌యాల్లో సానుకూలంగా చ‌ర్చించుకున్నారు.

ఇదే క్ర‌మంలో గ‌తంలో ఏపీ, తెలంగాణకు ద‌క్కాల్సిన నీటి వాటాల‌పై కూడా చ‌ర్చించుకున్నారు.

అయితే ఏపీ ప్ర‌భుత్వం కృష్నా న‌దిపై కొత్త ప్రాజెక్టులును నిర్మించ‌డంతో కేసీఆర్ దీనిపై సీరియ‌స్‌గానే ఉంటున్నారు.

ఇక మౌనం వ‌హిస్తే న‌ష్టం జ‌రుగుతుంద‌ని భావించి మొన్న జ‌ర‌గిన కేబినెట్ మీటింగ్లో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.

ఇక జ‌గ‌న్‌తో జ‌ల జ‌గ‌డం చేయ‌డాఇనికి కేసీఆర్ సై అన్నారు.కృష్ణా న‌దిపై ఏపీ ప్ర‌భుత్వం నిర్మిస్తున్న పోతిరెడ్డిపాటు, ఆర్డీఎస్ కుడికాల్వ‌ల‌కు ప‌ర్మిష‌న్ లేద‌ని వీటిపై కోర్టులో పోరాడాల‌ని డిసైడ్ అయింది.

ఇక ఇప్ప‌టి దాకా సీఎం జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై నేరుగా గానీ ప‌రోక్షంగా గానీ ఎలాంటి విమ‌ర్శ‌లు చేయ‌లేదు కేసీఆర్ ప్ర‌భుత్వం.

కానీ ఎప్పుడైతే కేసీఆర్ ఏపీ ప్ర‌భుత్వంపై యుద్ధం ప్ర‌క‌టించారో అప్ప‌టి నుంచి మంత్రుల‌కు జ‌గ‌న్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు.

అంతే కాదు కేసీఆర్ కృష్ణా నీళ్ల‌పై కొత్త‌గా రెండు కొత్త ప్రాజెక్టుల‌కు నిర్మించాల‌ని సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోవ‌డం ఇప్పుడు ర‌చ్చ‌కు దారి తీసింది.

"""/"/ ఇదే క్ర‌మంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్‌, వేముల ప్ర‌శాంత్‌రెడ్డిలు సీఎం జ‌గ‌న్ మీద సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

అయితే ఈ వ్యాఖ్య‌ల వెన‌క కేసీఆర్ ప్లాన్ ఉన్న‌ట్టు తెలుస్తోంది.ఈ రోజు వారు మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో ప‌ర్య‌టిస్తూ మాట్లాడారు.

ఉమ్మ‌డి రాష్ట్రంలో వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అన్యాయంగా కృష్ణా నీళ్ల‌ను త‌ర‌లించుకుపోయిన దొంగ అని వ్యాఖ్యానించారు.

ఇక ఇప్పుడు సీఎం జ‌గ‌న్ గ‌జ‌దొంగ‌లాగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని మండిప‌డ్డారు.కాగా కేసీఆర్ డైరెక్టుగా మాట్లాడ‌కుండా మంత్రుల‌తో విమ‌ర్శ‌లు చేయించ‌డం వెన‌క గ‌ట్టి ప్లాన్ ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఫోన్ ట్యాపింగ్ విషయంలో హైకోర్టుకు బీఆర్ఎస్..!