తెలంగాణ మంత్రుల ఫీలింగ్ ఇదా ? అయ్యో పాపం

తెలంగాణ మంత్రుల ఫీలింగ్ ఇదా ? అయ్యో పాపం

తెలంగాణలో రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత టిఆర్ఎస్ పార్టీలో అనూహ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి.

తెలంగాణ మంత్రుల ఫీలింగ్ ఇదా ? అయ్యో పాపం

ముఖ్యంగా అధినేత కేసీఆర్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు.ఏ విషయంలోనూ వెనకడుగు వేయకుండా, తాను అనుకున్నది చేసి చూపిస్తున్నాడు.

తెలంగాణ మంత్రుల ఫీలింగ్ ఇదా ? అయ్యో పాపం

ఈ విషయంలో తనకు అడ్డు వచ్చిన వారు పార్టీ నేతలైనా, ప్రత్యర్థులైన, ఎవరైనా లెక్కచేయకుండా కేసీఆర్ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాడు.

కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ఏవైనా వాటిని అమలులో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కేసీఆర్ ఎక్కడా లెక్క చేసే విధంగా కనిపించడంలేదు.

ఇది అనేక సందర్భంలో రుజువయ్యింది.ఇక కాబోయే సీఎం, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విషానికి వస్తే పాలనలోనూ, పార్టీలోనూ తనదైన శైలిలో ముద్ర వేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.

"""/"/ఇంత వరకు బాగానే ఉన్నా టిఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు క్రమశిక్షణ మితిమీరినట్టుగా కనిపిస్తోంది.

ముఖ్యంగా తెలంగాణ మంత్రులు పేరుకే తప్ప, పాలనలోనూ మరి ఏ విషయాల్లోనూ తమ మాట చెల్లుబాటు కావడం లేదని, పేరుకే మేము మంత్రులం తప్ప కెసిఆర్, కేటీఆర్ మొత్తం అన్ని వ్యవహారాలు చూస్తున్నారని తమ సన్నిహితుల దగ్గర బాధ వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.

మొదటిసారి టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తరహా వ్యవహారశైలి లేకపోయినా, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం కేసీఆర్, కేటీఆర్ హవా ఎక్కువైందట.

"""/"/ఇక మంత్రులు తమ శాఖలపై పూర్తిగా పట్టు సాధించి స్వతంత్ర నిర్ణయాలు తీసుకుందాం అన్నా అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదట.

ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్ మాత్రమే పెత్తనమంతా చేస్తున్నారట.తాము స్వతంత్రంగా ఏ నిర్ణయం తీసుకోకుండా పూర్తిగా కట్టడి చేసినట్లు తెలుస్తోంది.

రెండోసారి అధికారంలోకి రావడానికి నేనొక్కడినే కారణమని కెసిఆర్ బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.అందుకే ప్రభుత్వంలోనూ ప్రజల్లోనూ తమ పలుకుబడి పెంచుకుంటే సరిపోతుందిలే అన్నట్టుగా కేసీఆర్ కేటీఆర్ వ్యవహరిస్తున్నారు.

దీంతో మంత్రులు కాస్తా డమ్మీలుగా మారిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు.

అనారోగ్యాన్ని ఎదిరించి 508 కి.మీ నడక .. యువతకు స్పూర్తిగా నిలిచిన వాకింగ్ సింగ్