తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభం
TeluguStop.com
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప‌్రగతి భవన్ లో తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది.
వివిధ చట్టాల సవరణ ముసాయిదా బిల్లులపై మంత్రివర్గం చర్చించి , ఈ సమావేశంలో ఆమోదం తెలుపనున్నారు.
అలాగే ఈ భేటీలో అతి త్వరలో జరగబోయే శాసనసభలో ప్రవేశపెట్టనున్న బిల్లులపై మంత్రి వర్గం చర్చించనుంది.
జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లుపై కూడా చర్చించి ఆమోదించబోతున్నారు.ఇక , జీహెచ్‌ఎంసీ చట్టాల సవరణ, హైకోర్టు సూచనలతో పలు చట్టాల్లో మార్పులు చేసేందుకు మంగళవారం అసెంబ్లీ సమావేశం కానున్నది.
13న ఉదయం 11.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది.
శాసనమండలి ఈ నెల 14న ఉదయం 11 గంటలకు సమావేశమవుతుంది.ఇకపోతే , ధరణి యాప్ లో సీఎం కేసీఆర్ తన నివాసం వివరాలు నమోదు చేశారు.
ఎర్రవెల్లిలో సీఎం నివాసానికి వెళ్లి గ్రామ కార్యదర్శి వివరాలు ధరణి యాప్ లో నమోదు చేశారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ప్రజలంతా తమ స్థిరాస్తుల వివరాలను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఆస్తులపై ప్రజలకు హక్కు, భద్రత కల్పించేందుకే ధరణి యాప్ రూపొందించామని తెలిపారు.దేశంలోనే తొలిసారిగా చేపట్టిన స్థిరాస్తుల నమోదు ప్రక్రియ.
చర్రితలో మైలురాయిగా నిలిచిపోతుందని కేసీఆర్ చెప్పారు.
కలబందతో హెయిర్ గ్రోత్ సీరం ఎలా తయారు చేసుకోవాలో తెలుసా..?