తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాట్ కామెంట్స్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫోన్లు ధ్వంసం చేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎలా ఆరోపించారని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

ఫోన్లు ధ్వంసం చేయాల్సిన అవసరం కవితకు లేదని తెలిపారు.తన ఫోన్లు అన్నింటినీ కవిత ఈడీకి సమర్పించారని శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.

ఆడబిడ్డ ప్రతిష్టకు భంగం కలిగించారన్నారు.లక్షల కోట్ల స్కామ్ లు చేసిన వాళ్లను ఏం చేశారని ప్రశ్నించారు.

లలిత్ మోడీ, విజయ్ మాల్యా, నీరవ్ మోదీ ఎక్కడని ప్రశ్నించారు.అదానీ వ్యవహారంతో లక్షల కోట్ల రూపాయలు ఆవిరయ్యాయని చెప్పారు.

లక్షల కోట్లను వదిలేసి వంద కోట్ల కేసు వెంట పడతారా అని ప్రశ్నించారు.

సాక్ష్యాలను తారుమారు చేసి ఇరికించాలని చూస్తున్నారన్న మంత్రి లేనివి ఉన్నట్లు.ఉన్నవి లేనట్లు చిత్రీకరిస్తున్నారని విమర్శించారు.

వైరల్ వీడియో.. ఇందుకే కాదయ్యా నిన్ను ‘క్రికెట్ దేవుడు’ అనింది!