మంత్రి హరీశ్ రావుకు తృటిలో తప్పిన ప్రమాదం.. !!

ఈ రోజు తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్దిపేటలో పర్యటించి పలు కార్యక్రమాలను ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఇక ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని సమాచారం.కాగా ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు కూడా పాల్గొన్న విషయం తెలిసిందే.

అయితే ఈ ఫోగ్రాం ముగిసిన తర్వాత మంత్రి హరీష్ రావు కాన్వయిలో తిరిగి హైదరాబాద్ బయల్దేరి వస్తున్న సమయంలో కొండపాక మండలం బంధారం దర్గా కమాన్ సమీపంలో ఓ అడవిపంది ఉన్నట్టుండి రోడ్డుపైకి వచ్చిందట.

దీంతో ఆ కాన్వాయ్ డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడటంతో వెనుకగా వస్తున్న ఇతర వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయట.

ఈ ఘటనలో హరీష్ రావు గన్‌మెన్ కు స్వల్పగాయాలు అవగా అతన్ని ఆస్పత్రికి పంపించి మరో కారులో హరీష్ హైదరాబాద్‌కు బయలు దేరారట.

మొత్తానికి హరీష్ రావు తృటిలో ప్రమాదం నుండి తప్పించుకున్నారన్నమాట.

హరిహర వీరమల్లు మూవీ నుంచి ఆ ప్రముఖ నటుడు తప్పుకున్నారా.. ఏం జరిగిందంటే?