టీఆర్ఎస్ లో హారీష్ హవా తగ్గుతోందా .. తగ్గిస్తున్నారా

స్నేహమైనా.చుట్టరికమైనా రాజకీయాల్లో ఎల్లకాలం కొనసాగవు.

ఎవరి అవసరం అయినా ఒక స్టేజ్ వరకు ఎదిగేవరకే తప్ప జీవితాంతం నెత్తిన పెట్టుకుని కీర్తించే పరిస్థితి ఉండదు.

ఎందుకంటే అదే రాజకీయం కనుక.రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడూ ఇలాగే ఉంటాయి.

ఈ విధంగానే టీఆర్ఎస్ పార్టీలో నెంబర్ 2 గా పేరు పొంది కేసీఆర్ తరువాత హారీష్ నే అంతా అనే స్టేజ్ ఉండేది.

అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.టీఆర్ఎస్ లో హారీష్ పాత్ర అంతంతమాత్రమే అన్నట్టుగా తయారయ్యింది.

దీనికి కారణం కేసీఆర్ తనయుడు కేటీఆర్ కారణం అనే గుసగుసలు పార్టీలో వినిపిస్తున్నాయి.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ రాజకీయ వ్యూహాలతో టీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా ఎదిగి కేసీఆర్ కి నమ్మినబంటుగా హరీష్ ఉండేవారు.

ఒకానొక సమయంలో పార్టీలో కేసీఆర్ తర్వాత కీలకంగా వ్యవహరించారు.ఎక్కడ పార్టీకి ఇబ్బంది ఉన్నా హరీష్ రావు చక్కదిద్దేవారు.

అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.పార్టీ కార్యకలాపాల్లో హరీష్ రావుకు గతంలో ఉన్నంత ప్రాధాన్యత ఇప్పుడు కనిపించడంలేదు.

ఇటీవల జరిగిన ప్రగతి నివేదన సభ సమయంలో మాత్రం ఆయనను పూర్తిగా పక్కన పెట్టినట్లు కనపడింది.

కొంగర కలాన్ సభ సమయంలో హరీష్ రావు అంటీ ముట్టనట్టుగా వ్యవహరించారు.దీనికి కారణం ఏంటి అని పార్టీలో నాయకుల మధ్య పెద్ద చర్చ కూడా జరిగింది.

అంతలోనే ఆ సభ తర్వాత మూడు రోజులకు జరిగిన హుస్నాబాద్ సభకు హరీష్ రావు కీలకమయ్యారు.

అసెంబ్లీని రద్దు చేసి అభ్యర్థుల లిస్ట్ ప్రకటించిన కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా అభ్యర్థులను ఎంపిక చేశారు.

చాలా వరకు హారీష్ వర్గాన్ని దూరం పెట్టారు.వరంగల్ జిల్లాలో హరీష్ రావు వర్గంగా ముద్రపడ్డ కొండా సురేఖకు టిక్కెట్ రాకపోవడం చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.

ఇక అభ్యర్థుల ప్రకటన తర్వాత పార్టీలో అసంతృప్తి ఎక్కువవుతోంది.అభ్యర్థులను పార్టీ ద్వితీయ శ్రేణీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు.

సుమారు 50కి పైగా అభ్యర్థులపై ఈ తరహా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.పార్టీ కార్యకర్తలే అభ్యర్థుల దిష్టిబొమ్మలు దహనం చేసే పరిస్థితికి వచ్చింది వ్యవహారం.

అయినా హరీష్ మాత్రం అంటి ముట్టనట్టుగానే ఉంటున్నాడు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ టీఆర్ఎస్ లో గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు.

ఒక వేళా ఉంది ఉంటే వ్యవహారం వేరేగా ఉండేది.ఆ బాధ్యతలన్నీ హారీష్ తీసుకుని పరిస్థితి చక్కదిద్దేవాడు.

కానీ, ఇప్పుడు ఆయన ఈ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు.తనకు సంబంధం లేని విషయంగా ఉంటున్నారు.

పార్టీ కూడా హరీష్ రావుకు ఈ బాధ్యతలు ఏమీ అప్పగించినట్లు కనపడటం లేదు.

కేవలం కేటీఆర్ మాత్రం అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితిని సమీక్షించి అసంతృప్తులను బుజ్జగిస్తున్నారు.టీఆర్ఎస్ లో మారిన పరిస్థితులను బట్టి చూస్తుంటే.

కేటీఆర్ హవా పెంచేందుకే హరీష్ హవా క్రమక్రమంగా తగ్గిస్తున్నట్టుగా కనిపిస్తోంది.ముందు ముందు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో చూడాలి.

పునర్జన్మ ఉందా? యూఎస్ మేధావి సంచలన వ్యాఖ్యలు!