ఏపీ మంత్రి బొత్స కు తెలంగాణ మంత్రి గంగుల కౌంటర్
TeluguStop.com
తెలంగాణ మంత్రి గంగుల కమాలకర్ బొత్స వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు.తెచ్చుకున్న తెలంగాణపై ఇంకా విషం చిమ్ముతున్నారంటూ విమర్శించారు.
ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.’ఇప్పుడు వైసీపీలో ఉన్న బొత్స తెలంగాణ రాకముందు కాంగ్రెస్‌లో మంత్రిగా ఉన్నారు.
ఆయన అప్పుడు కూడా తెలంగాణ కి వ్యతిరేకంగా మాట్లాడారు.ఇప్పుడు తెలంగాణ స్వరాష్ట్రం వచ్చాక కూడా విషం చిమ్ముతున్నారు.
తెలంగాణ వచ్చాక రాష్ట్రము లో విద్యావ్యవస్థ మెరుగుపడింది.297 గురుకులాలు మాత్రమే నాడు తెలంగాణ ప్రాంతంలో ఉండేవి.
నాడు మంత్రిగా ఉన్న ఆంధ్ర నాయకుల వైఫల్యం వల్ల ఎంతోమంది చదవలేకపోయారు.కానీ ఇప్పుడు తెలంగాణ లో 1009 గురుకులాలు ఏర్పాటు చేసుకున్నాం .
పది లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు చదువుకుంటున్నారు.ఇప్పుడు కూడా ఏపీ లో 380 గురుకులాలే ఉన్నాయి.
అవి కూడా పదోతరగతికి మాత్రమే పరిమితం చేశారు.బొత్స సత్యనారాయణ ఇవ్వన్నీ వినాలే… ఇష్టానుసారం మాట్లాడటం సరికాదంటూ’ విరుచుకుపడ్డారు.
ఇక TSPSC పేపర్ లీకేజీ వ్యవహారంపై స్పందించి గంగుల.‘TSPSCలో తప్పు జరిగితే పట్టుకుంది ప్రభుత్వమే.
తప్పు చేసినవారిని శిక్షిస్తున్నాం.కానీ ఏపీ లో ఉద్యోగాలను దొంగదారుల్లో అమ్ముకుంటున్నారు .
కనీసం ఒక్కరినైనా పట్టుకున్నారా బొత్స చెప్పాలి.ఆంధ్రాలో ఎమ్మెల్యేలు ,APPSC మెంబర్లే వసూళ్లు చేసి ఉద్యోగాలు ఇస్తున్నారు.
బొత్స సత్యనారాయణ వీటన్నింటిపై సాయంత్రం లోపు స్పందించాలి.హైదరాబాదు మీద మళ్లీ ఆంధ్ర నాయకుల కన్ను పడిందా’ అంటూ ప్రశ్నించారు.
ఆడపిల్లలకు అన్యాయం జరిగితే కోపం వస్తుంది.. బన్నీ సంచలన వ్యాఖ్యలు వైరల్!