ఏపీలో కరెంట్ కోతలపై తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి కామెంట్స్
TeluguStop.com
ఏపీలో కరెంట్ కోతలపై తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో కరెంట్ లేక వైర్లపై బట్టలు ఆరేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే కరెంట్ ఉండదన్నారన్న మంత్రి ఎర్రబెల్లి ఇప్పుడు ఏపీలోనే కరెంట్ లేదని ఆయన విమర్శించారు.
కానీ తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇస్తున్నామని తెలిపారు.అనంతరం భూముల రేట్లపై కూడా స్పందించిన ఆయన ఏపీలో భూముల ధరలు పడిపోయాయని చెప్పారు.
ఈ క్రమంలోనే తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఏపీలో వంద ఎకరాలు వస్తోందని వెల్లడించారు.
హైదరాబాద్ లో మరో థియేటర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన బన్నీ… ప్రత్యేకతలు ఇవే!