కొవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి.. !
TeluguStop.com
దేశంలో రెండో దశ కరోనా వ్యాక్సిన్ పక్రియ విజయవంతంగా సాగుతుందట.ఇందులో భాగంగా ప్రతి వారు కరోనా టీకా తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు.
ఇందులో భాగంగా నేడు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ హుజురాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ మూడో విడుతలో 60 ఏళ్లు పైబడిన వారికి, 45 ఏళ్లు ఆ పైన ఉన్న వ్యాధి గ్రస్తులకు కోవిడ్ నివారణకు వ్యాక్సిన్ ఇస్తున్నామన్నారు.
కావున ఈ టీకా తీసుకోవడానికి తగిన వయస్సు, అర్హత గల వారంతా దీన్ని తమ బాధ్యతగా భావించి తీసుకోవాలని కోరారు.
కరోనా వైరస్‌ను జయించాలంటే ఉన్న మార్గం వ్యాక్సిన్ మాత్రమే కాబట్టి ఈ కోవిడ్ వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా, భయాలకు లోను కాకుండా తమను తాము రక్షించుకోవడానికి, తమ వల్ల ఇతరులకు వైరస్ సోకకుండా ఉండడానికి తప్పకుండా తెలంగాణ ప్రజలు అందరు కరోనా టీకా ఇప్పించుకోవాలని కోరారు.