అమెరికాలో పేలిన తూటా..తెలంగాణా వాసి మృతి
TeluguStop.com
అమెరికాలో గన్ కల్చర్ మళ్ళీ హెచ్చు మీరుతోంది.దుండగులు ఎంతో మంది అమెరికాలో తుపాకీ ల ద్వారా హత్యలకి పాల్పడుతున్నా సరే ప్రభుత్వ చర్యలు మాత్రం శూన్యంగానే కనిపిస్తున్నాయి.
అమెరికాలో దుండగుల కాల్పులలో ఎంతో మంది భారత సంతతి వ్యక్తులు.ఎన్నారైలు ప్రాణాలు కోల్పయిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి.
తాజాగా జరిగిన ఓ సంఘటన అమెరికాలో ఉంటున్న భారతీయ వ్యక్తులలో గుబులు రేపుతోంది.
అమెరికాలోని ఫ్లోరిడా లో చోటు చేసుకున్న ఈ ఘటన తెలుగు ఎన్నారైలలో మరింత బయాన్ని రేకెత్తిస్తోంది.
తెలంగాణకు చెందిన కొత్త గోవర్ధన్‌రెడ్డి అనే వ్యక్తిని ఓ గుర్తు తెలియని కొందరు దుండగులు కాల్చి చంపారు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
డిపార్ట్మెంట్ స్టోర్ లో కొత్త గోవర్ధన్ రెడ్డి మేనేజర్ గా పనిచేస్తున్నారు.
ఆయన స్టోర్ లో ఉండగా కొందరు దుండగులు స్టోర్ లోకి చుచ్చుకుని వచ్చి.
వెనువెంటనే గోవర్ధన్ రెడ్డి పై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.దాంతో గోవర్ధన్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరొక వ్యక్తిగా తీవ్ర గాయాలు అయ్యాయని తెలుస్తోంది.
అయితే గోవర్ధన్ గురించి మరింత సమాచారం రావాల్సిఉంది.
రక్తపు మరకల దుస్తులతోనే తండ్రికి కూతురు అంత్యక్రియలు.. వీడియో చూస్తే కన్నీళ్లాగవు..