తెలంగాణ శాసనసభ కౌరవ సభను తలపించింది – మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం చేసిన బిఆర్ఎస్ నాయకులు, అనంతరం మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ, అధికార గర్వంతో మదమెక్కిన కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ సాక్షిగా మహిళా ఎమ్మెల్యేలపై నోరు పారేసుకున్నరు.

సభా నాయకుడి స్థానంలో ఉన్నానన్న సోయి మరిచి స్వయంగా ముఖ్యమంత్రే ఈ వ్యాఖ్యలు చేయగా డిప్యూటీ సీఎం వంతపాడటం కలిచివేసే విషయమని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు.

మహాలక్ష్మిలను గౌరవించుకుంటామని, తమది ప్రజా ప్రభుత్వమని బీరాలు పలికిన ఈ సోకాల్డ్ నేతలు, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలను ఉద్దేశిస్తూ.

వాళ్లను నమ్మితే బతుకు బస్టాండేనని.ఇంకా ఏ ముఖం పెట్టుకుని అసెంబ్లీకి వస్తున్నారంటూ నిండు సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన్రు.

ఇది కాంగ్రెస్ దురంహకారానికి మచ్చు తునక.నేడు మహిళా నేతలకు జరిగిన ఈ అవమానం.

ఓ రకంగా తెలంగాణ సమాజానికి చీకటి దినం.బీఆర్‌ఎస్ పదేండ్ల పాలనే తీసుకుంటే.

రాజకీయాలు సహా అన్ని రంగాల్లో మహిళల్ని గౌరవించుకున్న తీరు ఇంకా కండ్లముందే ఉన్నది కానీ ఈ ఎనిమిది నెలల్లోనే ఎంత మార్పు ? మహిళలపై దాడులు జరగని గడియ లేదు లైంగికదాడుల వార్త వినని రోజు లేదు.

ఇగ రాష్ట్రంలో ఆడ బిడ్డల పరిస్థితి ఇట్లుంటే.అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేల పరిస్థితి అట్లున్నది.

అసలు తెలంగాణ ప్రజలు కోరుకున్న మార్పు ఇదేనా? ఈ ప్రాంత ఆడబిడ్డలను అవమానించేందుకేనా కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టింది పాలన చేతగాకుంటే పక్కకు తప్పుకోవాలె గానీ ప్రజా సమస్యలపై గొంతెత్తినోళ్లపై వ్యక్తిగత విమర్శలకు దిగడం మాత్రం కాంగ్రెస్ నేతల నీచ రాజకీయానికి తెరలేపిందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు.

ప్రభాస్ దర్శకుడితో సినిమా సెట్ చేస్తున్న ఎన్టీఆర్… ఇంతకీ ఎవరా డైరెక్టర్…