బీజేపీపై తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా ఫైర్

తెలంగాణపై కేంద్రం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.

నిధుల్లో కోత విధించి ఫెడరల్ వ్యవస్థకు విఘాతం కలిగిస్తోందని ఆరోపించారు.కుట్రలు చేస్తూనే అధికారంలోకి రావాలని బీజేపీ కుయుక్తులు చేస్తోందన్నారు.

తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడం బీజేపీకి తగదని సూచించారు.బీజేపీ వ్యక్తిగత దాడులు కూడా చేస్తోందని మండిపడ్డారు.

లిస్ట్ తయారు చేసి మరీ దాడులు చేస్తున్నారని ఆరోపణలు చేశారు.రాజకీయాల్లో ఇలాంటి పోకడలు చాలా ప్రమాదకరమని వ్యాఖ్యనించారు.

ఇప్పటికే దేశంలో రాజకీయాలు భ్రష్టు పట్టాయని వెల్లడించారు.

భారతీయ మహిళకి అమెరికాలో అత్యున్నత పదవి .. వెలుగులోకి మోడీ వ్యతిరేక చర్యలు