Telangana Legislative Council : మరోసారి వాయిదాపడ్డ తెలంగాణ శాసనమండలి..!!
TeluguStop.com
తెలంగాణ శాసన మండలి( Telangana Legislative Council ) మరోసారి వాయిదా పడింది.
మండలి సభ్యులపై చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు( BRS MLCs ) నిరసనకు దిగారు.
ఈ క్రమంలోనే మరోసారి ఛైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళన కొనసాగించారు.ఈ నేపథ్యంలోనే మండలి కార్యక్రమాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని ఛైర్మన్ విజ్ఞప్తి చేసినప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు శాంతించలేదు.
"""/" /
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందేనని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
దీంతో శాసనమండలిని ఛైర్మన్ మరోసారి వాయిదా వేశారు.అయితే మండలి సభ్యులపై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.