తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్‎కు రాజ్‎భవన్‎లో బ్రేక్..!!

తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్ కు రాజ్‎భవన్‎లో బ్రేక్ పడింది.టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల రాజీనామాలు రాజ్‎భవన్‎లో పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో రాజీనామాలు ఆమోదించాలా? వద్దా? అనే దానిపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ న్యాయనిపుణుల సలహాలు కోరారని తెలుస్తోంది.

అయితే రాజీనామాలు ఆమోదం పొందితేనే కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం సాధ్యం అవుతుంది.

టీఎస్పీఎస్సీ ప్రక్షాళనలో భాగంగా పాలకమండలిని రాజీనామా చేయించిన ప్రభుత్వం ఈ రాజీనామాలకు ఆమోదం తెలపాలని ఇప్పటికే మూడుసార్లు ప్రభుత్వం ప్రయత్నించిందని తెలుస్తోంది.

ఈ క్రమంలో గవర్నర్ నిర్ణయం తరువాత ఉద్యోగాల నోటిఫికేషన్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

యూఏఈలో భారతీయ మహిళకు మరణశిక్ష అమలు .. చివరి కోరిక ఇదే