నేటి నుంచి ఇంటర్ కళాశాలలకు సమ్మర్ హాలీడేస్
TeluguStop.com

నల్లగొండ జిల్లా: ఎండాకాలం వచ్చేసింది.ఓవైపు భానుడి భగభగలు మరోవైపు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు.


ఉదయం 9 గంటల నుంచి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.ఈ నేపథ్యంలో ఇప్పటికే విద్యాసంస్థలకు ఒంటిపూట తరగతులు నిర్వహిస్తున్నారు.


మరోవైపు ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో ఇంటర్ కళాశాలలకు సెలవులు ప్రారంభమయ్యాయి.రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడి యట్ బోర్డు సెలవులు ప్రకటించింది.
ఇవాళ్టి నుంచి నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని వెల్లడించింది.
మళ్లీ జూన్ 1వ తేదీన కళాశాలలు పునఃప్రారంభం అవుతాయని తెలిపింది.ఈ మేరకు అన్ని ప్రభుత్వ,ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది.
శ్రీలీల వల్లే ధమాకా సినిమా హిట్టైందా.. ఈ ప్రశ్నలకు జవాబు దొరికేసిందిగా!