పరీక్షల నిర్వహణ విషయంలో తెలంగాణ హైకోర్టు సంచలన కామెంట్స్..!!
TeluguStop.com
తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ పరీక్షల విషయంలో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
రాష్ట్రంలో ఇవాల్టి నుండి భౌతికంగా డిగ్రీ పరీక్షల నిర్వహణకు.తెలంగాణ విద్యా శాఖ ఏర్పాటు చేయడంతో ఉదయం 10 గంటల నుండి పరీక్షలు అయిపోయాయి.
ఇటువంటి తరుణంలో పరీక్షలు భౌతికంగా కాకుండా ఆన్లైన్ విధానం ద్వారా నిర్వహించాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ వేశారు.
పిల్ లంచ్ మోషన్ అడిగిన అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించడం జరిగింది.పరీక్షలు ఉదయం 10 గంటలకు మొదలై పోయాయని హైకోర్టు స్పష్టం చేసింది.
ఈ క్రమంలో తాము ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం పేర్కొంది.ఇదిలా ఉంటే డిగ్రీ ఇంజనీరింగ్ పరీక్షలు రద్దు చేయాలి అంటూ కొన్ని యూనివర్సిటీల నాయకులు ఈరోజు ఉదయం తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని ముట్టడించడం జరిగింది.
"""/"/ భౌతికంగా కాకుండా ఆన్లైన్ విధానం ద్వారా పరీక్షలు నిర్వహించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
మోహన్ బాబు కు ఫోన్ చేసిన రజినీకాంత్…ఏం చెప్పాడంటే..?