గ్రూప్ -3, 4 పరీక్షలపై స్టేకు తెలంగాణ హైకోర్టు నిరాకరణ
TeluguStop.com
తెలంగాణలో గ్రూప్ -3 మరియు గ్రూప్-4 పరీక్షలపై స్టే విధించేందుకు రాష్ట్ర హైకోర్టు నిరాకరించింది.
ఈ మేరకు ఉద్యోగ నియామకాల ప్రక్రియను నిలిపివేయలేమని కోర్టు స్పష్టం చేసింది.గ్రూప్ -3 మరియు గ్రూప్ -4 లో టైపిస్టుతో పాటు అసిస్టెంట్ పోస్టులు తొలగించారని ఆరోపిస్తూ సుమారు 101 మంది కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
జీవో 55, 136 కొట్టివేయాలన్న పిటిషన్లపై సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం విచారణ జరిపింది.
ఈ క్రమంలో ప్రభుత్వంతో పాటు టీఎస్పీఎస్సీకి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
అనంతరం తదుపరి విచారణను జూలై 13వ తేదీకి వాయిదా వేసింది.
జుట్టు దట్టంగా పెరగాలా.. అయితే ఈ ఆయిల్ ను వాడండి!